నందమూరి నటసింహం బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా భగవంత్ కేసరి. హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ దసరాకు మాంచి కాంపిటీషన్ లో విడుదలవుతోంది. ఓ వైపు రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయినా కూడా బాలయ్య సినిమాపై హైప్ అయితే మామూలుగా లేదు.
ఇక బాలయ్య నుంచి అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కావడం, వీరసింహారెడ్డి కూడా సంక్రాంతికి గట్టి పోటీ మధ్యలో వచ్చి సూపర్ హిట్ కొట్టడం… అనిల్ రావిపూడి డైరక్టర్ కావడంతో సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు. దాంతో రెండు నెలలకు ముందే ఈ సినిమా బిజినెస్ క్లోజ్ అయింది. టోటల్ గా థియేటర్ మీద రు. 70 కోట్లు నడుస్తోంది.
ఇక ఏరియాల వారీగా చూస్తే ఆంధ్ర ఏరియాను 35 కోట్లకు – సీడెడ్ 13 కోట్లకు – నైజాం 15 కోట్లకు అమ్మారు. మరీ ఎక్కువ రేట్లకు అయితే అమ్మలేదు. నైజాంలో 15 కోట్లు అంటే రీజన్‌బుల్ రేటుకే ఇచ్చారు. సీడెడ్ 13 కోట్లు అంటే బాలయ్య స్టామినాకు సరిపడా రేటు. ఇక ఓవర్సీస్‌ను రు. 5 కోట్లకు ఓన్ రిలీజ్‌కు వెళుతున్నారు.
అదర్ ఏరియాల నుంచి రు. 3 కోట్లు వస్తోంది. మొత్తం మీద రు. 70 కోట్లకు పైగా థియేటర్ మార్కెట్ చేశారు. ఇక నాన్ థియేటర్ ఉండనే ఉంది.
ఇది బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైం ప్రి రిలీజ్ బిజినెస్‌గా రికార్డులకు ఎక్కింది. సినిమాకు మొత్తం రు. 100 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అర్జున్ రామ్‌పాల్, శ్రీలీల, కాజల్ ఇలా కాస్త గట్టి కాస్టింగ్ తో ఆటు టెక్నికల్ కాస్టింగ్ కూడా బాగానే వుంది.