Newsఇన్నేళ్ల త‌ర్వాత బాలయ్య - రోజా సినిమా వ‌స్తోంది… ఏ సినిమానో...

ఇన్నేళ్ల త‌ర్వాత బాలయ్య – రోజా సినిమా వ‌స్తోంది… ఏ సినిమానో తెలుసా..!

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కొత్త సినిమాల విడుదలకు పోటీగా రీరిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోల ఒకప్పుడు నటించిన‌ హిట్ సినిమాలను అభిమానుల కోసం ఇప్పుడు మళ్ళీ వారి ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. స్టార్ హీరోల పుట్టినరోజులు, స్పెషల్ అకేషన్స్ కు ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఆ హీరోల అభిమానులు సైతం కొత్త సినిమాలుకు ఎంత హడావిడి చేస్తున్నారు.. రీ రిలీజ్ చేస్తున్న సినిమాలకి సైతం అంతకుమించి హడావిడి చేస్తున్నారు.

ఇక ఇప్పుడు అందులో భాగంగానే నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాలలోనే మెమరబుల్ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, గ్రాఫిక్స్ ,విజువల్ ఎఫెక్ట్స్ వచ్చాయి కాబట్టి పురాణాలు, పీరియాటిక్ సినిమాల్లో ఎఫెక్ట్స్ ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నాయి. కానీ ఇవేమీ లేనప్పుడు కూడా గ్రాఫిక్స్ తో అదరగొట్టిన సినిమా బైరవద్వీపం. నట‌సింహం నందమూరి బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హిట్‌గా నిలిచిన ఈ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది.

సీనియర్ దర్శ‌కుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను చందమామ విజయ కంబైన్స్ పతాకంపై బి. వెంకటరామిరెడ్డి నిర్మించాడు. ఈ సినిమాలో బాలయ్యకు జంట‌గా రోజా హీరోయిన్గా నటించగా మరో స్టార్ హీరోయిన్ రంభ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 1994లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భైరవద్వీపం అప్పట్లో సెన్సేషనల్ రికార్డులు సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ముఖ్యంగా బాలకృష్ణ- రోజా కాంబో ఇప్పుడు పొలిటికల్ గా గొడవ పడుతున్న వీరి మధ్య మంచి స్నేహం ఉండేదని అందరికీ తెలిసిందే.

భైరవద్వీపం లో వీరి రొమాన్స్ అప్పట్లో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక నరుడా ఓ నరుడా అంటూ రంభ‌ డాన్స్ ను ఇప్పటికే మర్చిపోవడం కష్టమే. ఇన్ని హైలెట్స్ ఉన్న‌ ఈ సినిమాను ఆగస్టు 30న రీరిలీజ్ చేస్తున్నట్లు ఈ చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాకుండా బైరవద్వీపం 4కె ట్రైలర్‌ను కూడా నిన్న రిలీజ్ చేశారు. ఇక ప్రస్తుతం ఆ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్ని సంవత్సరాల తర్వాత బాలకృష్ణ- రోజా రొమాన్స్ మరోసారి చూడాలంటే ఆగస్టు 30న థియేటర్లకు వెళ్లిపోవడమే మరి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news