Moviesభ‌గ‌వంత్ కేస‌రితో చిరు, నాగ్‌, వెంకీకి లేని రేర్ రికార్డ్ బాల‌య్య...

భ‌గ‌వంత్ కేస‌రితో చిరు, నాగ్‌, వెంకీకి లేని రేర్ రికార్డ్ బాల‌య్య ఖాతాలో..!

టాలీవుడ్ సీనియర్ హీరో నట‌సింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా భగవంత్‌ కేసరి. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే బాలయ్య కెరీర్లో షేర్ ప‌రంగా తొలి రు. 100 కోట్ల సినిమాగా భగవంత్‌ కేసరి రికార్డుల్లోకి ఎక్కబోతుందన్న అంచనాలు గట్టిగా ఉన్నాయి. వాస్తవానికి అఖండ – వీరసింహారెడ్డి సినిమాలు రిలీజ్ అయినప్పుడు బాలయ్యకు గట్టి పోటీ ఉంది.

అఖండ సినిమాకు కరోనాతో పాటు టికెట్ రేట్లు అనుకూలించలేదు. ఇక వీరసింహారెడ్డి రిలీజ్ అయినప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య – విజయ్ వారసుడు సినిమాలకు కూడా పాజిటివ్ టాక్ రావడంతో ఆ సినిమాకు సరైన స్థాయిలో స్క్రీన్లు దక్కక పోవడం పెద్ద మైనస్ అయింది. ఇక ఇప్పుడు భగవంత్‌ కేసరి సినిమాకు కూడా రవితేజ టైగర్ నాగేశ్వరరావు – విజయ్ లియో సినిమాల నుంచి పోటీ ఉన్నా కూడా బాలయ్యకు గతంలో ఎప్పుడూ లేనట్టుగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

భగవంత్‌ కేసరి సినిమాతో బాలయ్య ఈసారి కచ్చితంగా కుంభస్థలాన్ని కొట్టబోతున్నాడని.. ఈ సినిమా గ్రాస్ వసూళ్లు రు. 200 కోట్లు దాటుతుందని లెక్కలు వేస్తున్నారు. పైగా ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ కావటం.. శ్రీలీల‌ కూడా కీలకపాత్రలో నటిస్తూ ఉండటం కూడా సినిమాకు ప్లస్ కానుంది. భగవంత్ కేసరి ప్రపంచవ్యాప్తంగా రు. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇది బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్.

అలాగే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. బాలయ్య – అర్జున్ రాంపాల్ కాంబినేషన్లో వచ్చే సీన్లు అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో వన్ మిలియన్ పైగా వసూళ్లు రాబడితే ఓవర్సీస్ లో వరుసగా మూడు సినిమాలతో ఈ మార్క్‌ చేరుకున్న టాలీవుడ్ సీనియర్ హీరోగా బాలయ్య రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు. టాలీవుడ్‌లో సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్ ఎవ్వ‌రికి కూడా ఈ రేర్ రికార్డ్ లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news