Moviesబాల‌య్య - బాబి స్టోరీ లైన్.. హైలెట్స్ ఇవే… టాలీవుడ్‌లో ఫ‌స్ట్...

బాల‌య్య – బాబి స్టోరీ లైన్.. హైలెట్స్ ఇవే… టాలీవుడ్‌లో ఫ‌స్ట్ టైం ఇలా…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య దర్శకుడు బాబి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సితార బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కుతోంది. బాలయ్యకు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్న పేరు హీరోయిన్ గా వినిపిస్తోంది.

ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ సారథి స్టూడియోలో ఒక భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ విజువల్స్ చాలా వండర్ఫుల్ గా ఉంటాయని.. ముఖ్యంగా ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది అని.. బాలయ్య గెటప్ అండ్ సెటప్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో వచ్చే యాక్షన్ సీన్లు సినిమాకే మెయిన్ హైలెట్గా నిలుస్తాయంటున్నారు.

ఇక క‌థ‌తో పాటు క‌థ‌లో బాల‌య్య క‌నిపించే విధానం.. టాలీవుడ్‌లోనే చాలా కొత్త‌గా ఉండ‌బోతోంద‌ని… ఏ హీరో కూడా ట్రై చేయ‌ని విధంగా.. అఖండ‌లా కొత్త‌గా ఉండ‌బోతోంద‌ని స‌మాచారం. ఈ సినిమా బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదు… ఇది ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌తో సాగే ఎమోషనల్ డ్రామా అని స‌మాచారం.

ఇక సినిమాలో సెకండాఫ్‌లో వ‌చ్చే ప్లాష్‌బ్యాక్‌తో పాటు ఓ పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుంద‌ట‌. ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడు.. కాగా వ‌చ్చే స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news