కోలీవుడ్ సీనియర్ యాక్టర్ సత్యరాజ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా బాహుబలి సినిమాలో కట్టప్పగా నేషనల్ వైడ్‌గా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆయనకు ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీ వచ్చింది. తాజాగా సత్యరాజ్ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్యరాజ్ తల్లీ నతంబాల్ మృతి చెందారు. ఆమె వయసు 94 సంవత్సరాలు కాగా… గత కొంత కాలంగా ఆమెన్ని నెలలుగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. నతంబాల్ ఈ రోజు కోయంబత్తూర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
తల్లి మృతి చెందడంతో సత్యరాజ్ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. తల్లి మరణ వార్త విన్న వెంటనే హైదరాబాద్‌లో షూటింగ్లో ఉన్న సత్యరాజ్ హుటాహుటీన కోయంబత్తూర్‌కి వెళ్లారు. ఇక నతంబాల్కి మొత్తం ముగ్గురు పిల్లలు. వీరిలో ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి సత్యరాజ్, కూతుళ్ళు కల్పనా, రూప ఉన్నారు.
ఇక సత్యరాజ్‌కి తల్లి అంటే ఎంతో ఇష్టం.. కొడుకు నటించిన సినిమాలు చూడడం అంటే ఆమెకు ఎంతో ఇష్టం అట. సత్యరాజ్ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా కోలీవుడ్ నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ట్విట్టర్ వేదికగా సోదరుడు శ్రీ సత్యరాజ్ తల్లి నతంబాల్ మరణ వార్త విని బాధపడ్డాను.. అమ్మగారు మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశాడు.