Moviesపాన్ ఇండియా సినిమా లో "బేబీ".. పిలిచి మరీ అవకాశం ఇచ్చిన...

పాన్ ఇండియా సినిమా లో “బేబీ”.. పిలిచి మరీ అవకాశం ఇచ్చిన తెలుగు హీరో.. కారణం తెలిస్తే మతులుపోవాల్సిందే..!?

సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ మారుతుంది ఒకప్పుడు నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్స్ మాత్రమే సక్సెస్ అయ్యే వాళ్ళు . కానీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సామాన్య జనాలు కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. హ్యూజ్ సక్సెస్ అందుకుంటున్నారు . కాగా తాజాగా ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఫస్ట్ సినిమాతోనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కొట్టింది ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య. పలు వెబ్ సిరీస్ కవర్ సాంగ్స్ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య ..పలు సినిమాల్లో చిన్న చితకా పాత్రలు పోషించింది .

రీసెంట్గా హీరోయిన్గా డెబ్యూ ఇచ్చింది . సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి చైతన్య. ఈ సినిమాలో అమ్ముడు పర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ పలువురు అబ్బాయిలు వైష్ణవి పర్ఫామెన్స్ ను మర్చిపోలేకపోతున్నారు. ఆమె నటన పర్ఫామెన్స్ ను మొబైల్ లో బంధించి మరి చూసి ఎంజాయ్ చేస్తున్నారు . కాగా బేబీ హిట్ తర్వాత వైష్ణవి చైతన్యకు చాలా చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా అమ్మడు అఫీషియల్ గా ప్రకటించలేదు. ఇప్పటికే అల్లు అరవింద్ కొడుకు అల్లు శిరీష్ తో సినిమాకి కమిట్ అయిందట వైష్ణవి చైతన్య. అలాగే రామ్ పోతినేని నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ లోను సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . తాజాగా ఓ పాన్ ఇండియా సినిమాలో సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఇండస్ట్రీలోనే ఉండే టాప్ బడా ఫ్యామిలీలలో ఉన్న హీరో .. వైష్ణవి చైతన్య తెలుగు అమ్మాయి కావడంతో ఎంకరేజ్ చేయడానికి ఈ డెసిషన్ తీసుకున్నారట. అయితే నిజంగానే అమ్మడికి ఛాన్స్ వచ్చిందా ..? లేదా కేవలం ఇది సోషల్ మీడియాలో పుట్టిన ప్రచారమా..? తెలియాల్సి ఉంది . మొత్తానికి సోషల్ మీడియాలో వైష్ణవి చైతన్య పేరు మాత్రం మారం మ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news