Moviesభగవంత్ కేసరి సినిమాలో మరో యంగ్ హీరోయిన్..ఇక్ శ్రీలీల కు దబిడి...

భగవంత్ కేసరి సినిమాలో మరో యంగ్ హీరోయిన్..ఇక్ శ్రీలీల కు దబిడి దిబిడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 19న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాలో బాలయ్యని ఇప్పటివరకు మనం తెరపై ఎప్పుడు చూడని విధంగా చూడబోతున్నాం అంటూ క్రేజీ హింట్ ఇచ్చేశాడు అనిల్ రావిపూడి.

ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అంతేకాదు బాలయ్యకు కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుంది . కాగా ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ ఉంది అంటూ సెన్సేషనల్ మ్యాటర్ వైరల్ అవుతుంది. ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ తెలుస్తుంది.

రీసెంట్ గానే బ్రో సినిమాలో సిస్టర్ రోల్ లో నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ ఈ సినిమాలో విలన్ సిస్టర్ గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు బాలయ్య ప్రియా ప్రకాష్ వారియర్ మధ్య వచ్చే సీన్స్ డైలాగ్స్ కూడా చాలా ఎమోషనల్ గా ఉండబోతున్నాయట. దీంతో ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . ఇద్దరు యంగ్ హీరోయిన్స్ ఒక సీనియర్ హీరోయిన్ ఒక మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఒక సూపర్ మాస్ హీరో కలిస్తే రచ్చ రంబోలానే అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news