ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో మరోసారి నాగబాబుని ట్రోలింగ్ కి గురిచేస్తున్నారు కొందరు జనాలు . దానికి కారణం రీసెంట్గా మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకోవడం మెగా ఫ్యామిలీకి ఓ మైనస్ .. అయితే ఆయన కొడుకు వరుణ్ తేజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన గాంధీవదారి అర్జున డిజాస్టర్ టాక్ ని నమోదు చేసుకోవడం మరో మైనస్ గా మారింది.
ఎస్ వరుణ్ తేజ్ నటించిన గాండీవ దారి అర్జున బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది . పరమ చెత్త టాక్ నమోదు చేసుకుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరోసారి మెగా హేటర్స్ రెచ్చిపోతున్నారు . అంతేకాదు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఆస్కార్ స్థాయిలో ఎదిగిపోతున్నాడు ..రీసెంట్ గాని అల్లు అరవింద్ కొడుకు బన్నీ జాతీయ అవార్డు అందుకున్నాడు.. పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు మరో వైపు రాజకీయాల్లో దూసుకుపోతున్నాడు ..
ఇలా అందరూ ఫ్యామిలీస్ బానే ఉన్నా మెగా ఫ్యామిలీలో నాగబాబు ఫ్యామిలీ మాత్రం రోజురోజుకీ డౌన్ ఫాల్ అయిపోతుందని.. ఓ పక్క కూతురు మరోపక్క కొడుకు ఆయన పరువు తీసేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు నిహారిక విడాకులు తీసుకోవడం నాగబాబు ఫ్యామిలీకి అస్సలు కలిసి రాలేదని అందుకే ఇలాంటి బ్యాడ్ విషయాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పుకొస్తున్నారు..!!