Moviesఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్...

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. ఫ్యాన్స్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ.. ఈసారి పుష్ప గాడు వేరే లెవల్(video)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఎలా మారు మ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గానే ఆయన నటనకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది . పుష్ప సినిమాకి గాను అల్లు అర్జున్ కు ఉత్తమనటుడిగా జాతీయ అవార్డు వరించడంతో ఆయన ఇంస్టాగ్రామ్ కోసం ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు .

ఈ క్రమంలోనే ఆ వీడియోలో బన్నీ మార్నింగ్ నుంచి షూట్ లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని క్లియర్గా వీడియో రూపంలో తెలియజేశారు . అల్లు అర్జున్ మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో చూపించాడు .చాలా ప్లెసెంట్ గా పీస్ ఫుల్ గా ఉండే లొకేషన్స్ లో యోగా చేయడం ..బ్లాక్ కాఫీ తీసుకోవడం.. వాకింగ్ చేయడం పిల్లలతో ఫోన్లో మాట్లాడడం ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ ఈ వీడియోలో షేర్ చేశారు .

అంతే కాదు పుష్ప 2 సెట్స్ నుంచి వీడియోను కూడా రిలీజ్ చేశారు. తన షూటింగ్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాను అనే విషయాన్ని సైతం బన్నీ చెప్పుకొచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది . అంతేకాదు అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప2 సినిమా చివరి దశలో ఉందని .. త్వరలోనే దీనికి సంబంధించిన కీలక అప్డేట్స్ రివీల్ చేయబోతున్నాం అంటూ చెప్పుకొస్తున్నారు ఫాన్స్ . అంతేకాదు ప్రెసెంట్ పుష్ప సినిమాకి సంబంధించిన ప్రతి న్యూస్ వైరల్ గా మారాయి . ఈ క్రమంలోనే పుష్ప సినిమాకి మరింత బజ్ ఏర్పడింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news