బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్… సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ ప్రేమాయణం 30 సంవత్సరాల క్రితం నేషనల్ మీడియాలో ఒక సెన్సేషన్. వీరిద్దరూ కలిసి ఎక్కడైనా కనిపిస్తే చాలు నేషనల్ మీడియా అటెన్షన్ అంతా వీరి మీద ఉండేది. 1994లో హిట్ సినిమా మెహ్రాలో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఈ సినిమా విడుదల సూపర్ హిట్ అయిన వెంటనే 1995లోనే వీరు ప్రేమలో పడిపోయి డేటింగ్లో మునిగి తేలారు.
ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన వీరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ అయ్యాక వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత అక్షయ్ 2001లో హీరోయిన్ గా మారిన రచయిత్రి ట్వింకిల్ కన్నా ను వివాహం చేసుకున్నారు. రవీనా 2004లో ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానిని పెళ్లాడారు.
ఎంతో గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట ఎందుకు ? విడిపోయారు అన్నది అప్పట్లో పెద్ద హాట్ టాపిక్. తనతో ఎంగేజ్మెంట్ జరిగాక కూడా అక్షయ్ కుమార్ కొందరు హీరోయిన్లతో ఎఫై…ర్లు నడిపేవాడని ఇది తెలిసిన రవీనా పద్ధతి మార్చుకోమని హెచ్చరించినా… ఆడవాళ్ళ మనసులు దోచుకునే ఖిలాడీ అయిన అక్షయ్ తీరు మారకపోవడంతో అతడు చేసిన నమ్మకద్రోహంతోనే అతనికి దూరమైందని అంటారు.
ఓ వైపు రవీన కంటే ముందే అక్షయ్ శిల్పాశెట్టి – రేఖ లాంటి వాళ్ళతో ఎఫైర్లు నడిపాడు.. ఇటు రవీనాతో ఎంగేజ్మెంట్ తర్వాత కూడా ట్వింకిల్ ఖన్నాతో ప్రేమలో పడ్డాడు.. ఇవన్నీ భరించలేక రవీనా అతడికి దూరమైందని అంటారు. విచిత్రం ఏంటంటే వీరిద్దరూ ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత తిరిగి వెల్కమ్ – 3 సినిమా కోసం కలిసి నటించనున్నట్టు నేషనల్ మీడియా సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. వీరిద్దరూ కలిసి నటిస్తే నిజంగానే బాలీవుడ్ సినీ అభిమానులకు పెద్ద పండగ అని చెప్పాలి.