Moviesఇది దేవుడి సినిమా నా..? సె** సినిమా నా..? సెన్సార్ బోర్డ్...

ఇది దేవుడి సినిమా నా..? సె** సినిమా నా..? సెన్సార్ బోర్డ్ మెంబర్సే కళ్ళు మూసేసుకునేంతలా..!!

ప్రజెంట్ బాలీవుడ్ జనాలు ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా “ఓ మై గాడ్ 2”. ఈ సినిమా 2012లో వచ్చిన ఓ మై గాడ్ సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోగా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. చాలా డిఫరెంట్ లుక్ లో అక్షయ్ కుమార్ కనిపించబోతూ ఉండడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు. కాగా మొదటినుంచి ఈ సినిమాపై అభిమానుల్లో ఓ రకమైన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా పేరుకి సినిమా పోస్టర్ కి సినిమాల్లో తెరకెక్కె కంటెంట్ కి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉన్నాయి అంటూ బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తున్నారు . అయితే రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది .

సినిమాలో చిన్న చిన్న మార్పులు చేస్తూ సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేసిందట . అయితే ఊహించిన విధంగా ఆ సర్టిఫికెట్ ఇవ్వడం మాత్రం అందరికీ షాకింగ్ అనిపిస్తుంది .ఇది దేవుడి సినిమా ..మరి దేవుడు సినిమాకి ఇలా ఆ సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటి..? అంటూ ఫైర్ అవుతున్నారు జనాలు. అయితే ఈ సినిమాకు మొదటగా U/A సర్టిఫికెట్ మంజూరు చేయడానికి కమిటీ చాలా కట్స్ సూచించిందట . కానీ మేకర్స్ మాత్రం ఆ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదట. వాళ్ళు ఆ కట్స్ ని అంగీకరించకపోవడం వల్లే ఆ సీన్స్ అలాగే ఉంచి ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇందుకు మేకర్స్ కూడా ఓకే చెప్పారట.

అయితే అక్షయ్ కుమార్ ని దేవుడు పాత్రలో చూపిస్తున్నారు ..సినిమా అంతా కూడా దేవుడికి కంటెంట్ మీదే ఉంటుంది అంటూ చెబుతున్నారు. మరి A సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి అనేది ఇప్పుడు అభిమానులకు అర్థం కావడం లేదు. అయితే బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమా స్టోరీ లైన్ ఇలా ఉంది . “ఈ సినిమాలో ఓ కుర్రాడు గే అయితే ఆ విషయం తెలిసిన పిల్లలు అతని ని ఏడిపిస్తారు . ఈ క్రమంలోనే ఆ బాధ భరించలేక కుర్రాడు ఆత్మహత్య చేసుకుంటాడు .

దీంతో ప్రిన్సిపల్ పరిస్థితిని అర్థం చేసుకొని ర్ర యువతలో సెక్స్ పై అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అని ..అందుకే కాలేజీలు అలాంటి పాటలు కంపల్సరీ చేస్తాడు . దాంతో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ టైంలోనే శివుడు ఎంట్రీ ఇస్తాడు . అప్పుడు శివుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించారు అనేది ఈ కథ మెయిన్ లైన్ అంటూ ప్రచారం జరుగుతుంది. మొత్తానికి అక్షయ్ కుమార్ మరో కాంట్రవర్షియల్ కంటెంట్ ని టచ్ చేసాడు అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి రిజల్ట్ ఎలా ఉంటుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news