వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీరిద్దరూ హీరోయిన్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు హీరోలతో కలిసి హిట్ సినిమాలలో నటించిన ఒక స్టార్ హీరోయిన్ ఇద్దరు విషయంలో ఆసక్తికర కామెంట్లు చేసింది. ఆ హీరోయిన్ ఎవరో ? కాదు కాజల్ అగర్వాల్.
కాజల్ రామ్ చరణ్ కు జోడిగా మగధీర లాంటి సూపర్ హిట్ సినిమాతో పాటు గోవిందుడు అందరివాడేలే సినిమాలోను నటించింది. ఇక ఎన్టీఆర్ తో టెంపర్ – బాద్ షా- బృందావనం సినిమాలలో నటించింది. అలాగే జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఆడి పాడింది. కాజల్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ఆమెను రాపిడ్ ఫెయిర్ రౌండ్లో భాగంగా మీకు అవకాశం వస్తే ఏ హీరోను చంపేస్తారు ? ఎవరిని పెళ్లి చేసుకుంటారు ? ఏ హీరోతో లేచిపోతారు అని అడిగింది.
దీనికి కాజల్ సింపుల్‌గా సమాధానం ఇస్తూ నేను ఎన్టీఆర్ తో లేచిపోతాను.. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుని.. ఛాన్స్ వస్తే రాంచరణ్ చంపేస్తా అంటూ ఆన్సర్ ఇచ్చింది. మగధీర సినిమా షూటింగ్ టైంలో కాజల్‌ను చెర్రీ ఆట పట్టించే వాడట. రామ్ చరణ్ గుర్రం పేరు కూడా కాజల్ కావడంతో ప్రతిసారి తన గుర్రాన్ని పిలుస్తూ కాజల్‌ను బాగా ఏడిపించేవాడట. అందుకే కాజల్ సరదాగా చరణ్‌ను చంపేస్తా అని ఆన్సర్ చేసిందా ? అన్న చర్చ నెట్టింట్లో జరుగుతోంది. కాజల్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చి చాలా రోజులు అయినా అప్పటి వీడియో తాజాగా మరోసారి నెట్ లో ట్రెండ్ అవుతుంది.