Newsమ‌ర‌ద‌లితోనే అభిరామ్ పెళ్లి... శ్రీరెడ్డి ఏమైపోతుందో...!

మ‌ర‌ద‌లితోనే అభిరామ్ పెళ్లి… శ్రీరెడ్డి ఏమైపోతుందో…!

టాలీవుడ్ లో క్రేజీ ఫ్యామిలీ అయినా దగ్గుబాటి ఇంట‌ పెళ్లి సందడి మొదలుకానుందా ? నిర్మాత సురేష్ బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ కు పెళ్లి చేయాలని సురేష్ బాబు నిర్ణయించారా ? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. రానా తమ్ముడు అభిరామ్ తేజ దర్శకత్వంలో వచ్చిన అహింస సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే ఆ సినిమాలు అంచనాలు అందుకోలేదు. గతంలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి అభిరామ్‌ను వార్తల్లోకి లాగి అభిరామ్ తనను వాడుకున్నాడు అంటూ అతని పేరు ఎంతలా వార్తల్లోకి ఎక్కించిందో తెలిసిందే.

ఈ ఇన్సిడెంట్ అభిరామ్ కెరీర్ ను చాలా వరకు దెబ్బతీసింది. ఇలాంటివి జరగకుండా ఉంటే అభిరాం తెలుగు తెరకు ఎప్పుడో హీరోగా పరిచయం అయ్యేవాడు. ఇక అహింస సినిమాతో హీరో అయిన అభిరామ్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి కుటుంబం అతడికి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటికే అమ్మాయిని కూడా వెతికినట్టు తెలుస్తోంది.

రానాలా కాకుండా ఈసారి బంధువుల అమ్మాయిని కోడలిగా చేసుకోవాలని సురేష్ బాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కారంచేడు కు చెందిన అభిరామ్ చిన్నతాత కుమార్తె కూతురునే ( అభిరామ్‌కు మ‌ర‌ద‌లు) అభిరామ్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే ఇరు కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు అన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లి జరగనున్నట్లు సమాచారం.

దీంతో దగ్గుబాటి అభిమానులు అభిరాంకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్లి తర్వాత అభిరామ్ లైఫ్ గాడిన పడుతుందని కుటుంబం మొత్తం ఆశిస్తోంది. ఇక రానా ఇప్పటికే మిహికా బజాజ్ ను ప్రేమ వివాహం చేసుకోగా అభిరామ్ మాత్రం పెద్దలు కుదిర్చిన తన మరదలినే పెళ్లాడబోతున్నాడు. త్వరలోనే దగ్గుబాటి కుటుంబం అభిరాం పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news