Moviesసినీ చరిత్రలోనే అతి పెద్ద బిగ్ మల్టీస్టారర్ సినిమా..రాజమౌళి డైరెక్షన్ లోనే.....

సినీ చరిత్రలోనే అతి పెద్ద బిగ్ మల్టీస్టారర్ సినిమా..రాజమౌళి డైరెక్షన్ లోనే.. ఎంతమంది హీరోలు అంటే..!

ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతుంది . అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ ..టాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలలో మల్టీ స్టారర్ ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తున్న సంగతి తెలిసిందే . ఇలాంటి క్రమంలోనే జనాలు కూడా ఎక్కువగా మల్టీ స్టారర్ ల సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఉండడంతో పలువురు డైరెక్టర్స్ అదే విధంగా మల్టీ స్టారర్ సినిమాలు తీయ్యాలని నిర్ణయించుకున్నారు .

కానీ ఇక్కడ కొందరు నెటిజెన్స్ టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి ట్యాగ్ చేసి మరి పలానా హీరోలతో మీరు మల్టీ స్టారర్ తీయ్యండి అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. ఆ హీరోలు తెలుగు ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోలు కావడం మరింత గమనించాల్సిన విషయం . టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్న మహేష్ బాబు -పవన్ కళ్యాణ్ -అల్లు అర్జున్ -రామ్ చరణ్ -ఎన్టీఆర్ లతో కలిపి ఓ బిగ్ బడా మల్టీస్టారర్ మూవీ చేయమని అభిమానులు కోరుతున్నారు.

ఇండస్ట్రీలో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేయగలిగే డైరెక్టర్ మీరే అని.. మీరు ఈ కాంబోను కానీ సెట్ చేస్తే పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయిలో రికార్డులు కొల్లగొట్టడం కన్ఫామ్ అని దయచేసి ఈ కాంబోని సెట్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు . ఒకవేళ నిజంగానే ఇది జరిగితే మాత్రం సినీ ఇండస్ట్రీలో అది ఒక చెరగని రికార్డుగా మిగిలిపోతుంది . ఇప్పటివరకు ఏ డైరెక్టర్ టచ్ చేయని రికార్డ్లు బద్దలు కొట్టిన్నట్లే రాజమౌళి అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు . మరి జక్కన్న అంతటి సాహసం చేస్తారా..? లేదా..? తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news