Moviesరెండు నెల‌ల గ్యాప్‌లో 2 ఎన్టీఆర్ సినిమాలు… తార‌క్ ఫ్యాన్స్‌ను అస్స‌లు...

రెండు నెల‌ల గ్యాప్‌లో 2 ఎన్టీఆర్ సినిమాలు… తార‌క్ ఫ్యాన్స్‌ను అస్స‌లు ఆప‌లేం..!

టాలీవుడ్ యంగ్ టైగర్ తన అభిమానులను బాగా డిజ‌ప్పాయింట్ చేశాడనే చెప్పాలి. ఇప్పుడు 2018లో అరవింద సమేత సినిమా తర్వాత నాలుగేళ్ల పాటు లాంగ్ గ్యాప్ తీసుకుని గత ఏడాది త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. అంటే నాలుగేళ్లలో ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. త్రిబుల్ ఆర్ సినిమా వచ్చి కూడా యేడాదిన్నర అవుతోంది.

ఇంకా ఎన్టీఆర్ కొత్త సినిమా రిలీజ్ కాలేదు. ఎట్టకేలకు ఊరించి ఉరించి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. దేవ‌ర‌ ఓవైపు చకచకా షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న దేవర సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యాక రెండేళ్లకు గాని ఎన్టీఆర్ థియేటర్లలోకి రావడం లేదు.

ఫ్యాన్స్ ఎన్టీఆర్ సినిమాల కోసం యేళ్ల‌కు యేళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాల కోసం ఇంతలా వెయిట్ చేస్తున్న అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చింది. వచ్చే ఏడాది రెండు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలతో.. అది కూడా రెండు పాన్ ఇండియా సినిమాలతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ముందుగా ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ కానుంది.

ఆ వెంటనే హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వార్ 2 సినిమా కూడా రిలీజ్ కానుంది. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ ప‌వ‌ర్ ఫుల్ నెగ‌టివ్ రోల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక మే చివ‌ర్లో లేదా జూన్‌లో వార్ 2 థియేట‌ర్ల‌లోకి రిలీజ్ కానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news