మన తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది మొదటిలో బాగా కలిసి వచ్చింది.. ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్‌కు మంచి ఊపు వచ్చింది. ఈ సినిమాల తర్వాత కూడా దసరా, విరూపాక్ష, బలగం వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలు వచ్చాయి. ఇలా ఈ సంవత్సరం వరసగా మంచి విజయాలు వచ్చాయని ఆనందం ఉంది కానీ మరోపక్క చాలా దారుణమైన డిజాస్టర్ లు వరుస పెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
వాటిని చూస్తుంటే ఎంత దారుణమంటే మొదటి వీకెండ్ లోనే బోల్తా కొట్టేసి కనీసం సగం థియేటర్ కూడా నింప్లేనంతగా దారుణంగా ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన ‘గాండీవధారి అర్జున’తో వరుణ్ తేజ్ కు మరో మర్చిపోలేని డిజాస్టర్ ను తన ఖాతాలు వేసుకున్నాడు. ఈ సినిమా కన్నా ముందు వరుణ్ పెదనాన్న చిరంజీవి భోళా శంకర్ తో మర్చిపోలేని డిజాస్టర్ ను టాలీవుడ్‌కు అందించడం. కేవలం రెండో వారంలోపే దుకాణం గల్లంతయ్య రేంజ్ లో మెగాస్టార్‌కు భారీ అవమానం మిగిల్చింది.
ఈ సినిమాలుకు ముందు ‘శాకుంతలం’తో దిల్ రాజు గుణశేఖర్ లు ఎంత నష్టపోయారో వాళ్ళిద్దరికే తెలిసిన రహస్యం. అంతేకాకుండా మాస్ మహారాజా బ్రాండ్ ఒకటే సరిపోదని రావణాసుర ఫలితం మరోసారి రుజువు చేసింది. అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా ఎంత పెద్ద ప్లాప్ అయిందొ అందరికీ తెలిసిందే.ఇప్పటికి ఓటిటిలోకి రావడానికి ఇంకా భయపడుతూనే ఉంది. కళ్యాణ్ రామ్ అమీగోస్ సైతం బ్రేక్ ఈవెన్ లో సగాన్ని టచ్ చేయలేకపోయింది. నాగచైతన్య కస్టడీ, గోపీచంద్ రామబాణం, నిఖిల్ స్పై సందీప్ కిషన్ మైఖేల్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు అవుతుంది.
పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా పవన్ కళ్యాణ్ క్రేజ్‌తో నార్మల్ ప్రాఫిట్స్ తెచ్చుకుని ఓ మాదిరి హిట్‌గా నిలిచింది. ఈ విధంగా మన టాలీవుడ్ లో ఈ సంవత్సరం ఆరంభంలో వరుస విజయాలు వచ్చిన ఆ తర్వాత వచ్చిన సినిమాలతో దర్శకులు, హీరోలు టాలీవుడ్ బాక్సాఫీస్‌కు తీరని నష్టాన్ని కలిగించారు. దీంతో మన టాలీవుడ్‌ను వరుస విజయాలు వైపు నడిపించే హీరోలు లేరా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక మరి ప్రస్తుతం వచ్చే సినిమాలు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తాయా లేక విజయాల వైపు దూసుకు వెళ్తాయా ? లేదా అనేది చూడాలి.