సినిమా ఇండస్ట్రీలో గాసిప్లు అనేవి సర్వసాధారణం . ఎలాంటి స్టార్ హీరో అయిన హీరోయిన్ అయినా సరే ఆ గాసిప్ లకు బలి అవ్వక తప్పదు. ఇండస్ట్రీలో చిరంజీవి లాంటి స్టార్ హీరోలే గాసిప్స్ కారణంగా బాధపడ్డారు ..అంటే మిగతా హీరోలు వాళ్ళు ఒక్క లెక్క చెప్పండి . అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు మనం మంచి చేసిన సరే అవి తప్పుగానే చూస్తూ ఉంటారు కొందరు జనాలు . ఈ క్రమంలోనే తాజాగా అలాంటి న్యూస్ స్నేహ కి సంబంధించి ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . ట్రెడిషనల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న స్నేహ ఎలాంటి పాత్రలు చూస్ చేసుకుని జనాలను మెప్పించిందో మనకు బాగా తెలిసిందే.
మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సౌందర్య గారి తర్వాత అలాంటి క్రేజీ స్థానాన్ని అందుకుని స్నేహ పద్ధతిగా చీర కట్టుకొని ఎక్స్పోజింగ్ అనేది లేకుండా వల్గారిటీ అనేది లేకుండా తన సినిమాలో నటించింది . అయితే హీరో నాగార్జునను హీరోయిన్ స్నేహ ఇష్టపడింది అనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా నాగార్జున స్నేహ కలిసి నటించిన సినిమా శ్రీరామదాసు . ఈ సినిమాలో వీళ్ళిద్దరి నటన చాలా చక్కగా చూడముచ్చటగా అనిపించింది. అయితే ఈ సినిమా టైంలో స్నేహ నాగార్జునకు చాలా చనువుగా మూవ్ అయ్యింది. మిగతా ఏ హీరోలతోనూ అలా మూవ్ అవ్వదు . అయితే దానికి కారణం స్నేహ కి మొదటి నుంచి నాగార్జున గారు అంటే గౌరవం , ఇష్టం .
అయితే అది తెలుసుకోకుండా కొందరు ఆకతాయిలు స్నేహ కి నాగార్జునకి మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉంది అంటూ వార్తలు ట్రెండ్ చేశారు. అంతేకాదు శ్రీరామదాసు సినిమా టైంలో షూటింగ్ కి వెళ్ళినప్పుడు చాలాసార్లు షూటింగ్ కంప్లీట్ అయిపోగానే చాలా సేపు కబ్లుర్లు ఆడుకునేవారట.ఓ రోజైతే రాత్రి మొత్తం వీళ్లిద్దరూ కూర్చొని ఇలాగే మాట్లాడుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ కబుర్లు ఆడుకున్నారట. ఆ న్యూస్ మీడియాకి లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అన్న వార్త తెగ వైరల్ గా మారింది. అయితే స్నేహ ప్రజెంట్ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఇలాంటి వార్తను ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు..ఇదేమి పైశాచిక ఆనందమో వాళ్ళకే తెలియాలి..!!