టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే . కాగా రీసెంట్ గానే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతున్నాను అని .. డేటింగ్ చేస్తున్నాను అని ఓపెన్ గా చెప్పుకొచ్చిన తమన్నా .. ప్రెసెంట్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో హీరోయిన్గా చేసింది.
ఈ క్రమంలోనే రీసెంట్ గా ఆమె నటించిన పాట “కావాలా” అనే సాంగ్ రిలీజ్ అయింది . అయితే ఈ సాంగ్ సోషల్ మీడియాని యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఎప్పుడు కనిపించినంత హాట్ గా తమన్న కనిపించడంతో కుర్రాళ్ళు మతులు పోతున్నాయి. అయితే ఈ సాంగ్ లో తమన్నా హాట్ నెస్ పై ఆమె బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కూడా స్పందించారు . “ఈ పాటలో తమన్నా చాలా హాట్ గా హిట్ పుట్టిస్తుంది.. రజినీకాంత్ దేవుడు ..అయితే తమన్న దేవత ” అంటూ ఇన్స్టా స్టోరీలో పెట్టుకోచ్చాడు .
దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది . అంతేకాదు నీ కాబోయే భార్య నీ పక్కన నటిస్తే బాగుంటుంది ..కానీ పక్కన వాడితో నటిస్తే ఏం బాగుంటుంది..? ఇదేం ఆనందం రా సామీ అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో విజయవర్మ – తమన్నా పేర్లు మారుమ్రోగిపోతున్నాయ్.