ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎంత బాగా పాపులారిటీ సంపాదించుకున్నారో మనకు బాగా తెలిసిన విషయమే . మరీ ముఖ్యంగా హీరోయిన్ సమంత హీరో నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని ముందే ప్రకటించి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన వేణు స్వామి అన్నట్టే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు . ఆ తర్వాత ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్ లైఫ్ లో జరగబోయే విషయాన్ని ముందే చెప్పుకొచ్చిన వేణు స్వామి రీసెంట్గా హీరోయిన్ రష్మిక మందన పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి .
వేణు స్వామి – రష్మిక మందన్నా ల మధ్య ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే . రష్మిక -రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకోమని చెప్పింది వేణు స్వామి నే అంటూ ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు . ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉందని ఒకవేళ ఆ నిశ్చితార్ధం తర్వాత పెళ్లి చేసుకుంటే.. ఆమె కెరియర్ కొల్లాప్స్ అవుతుందని జాతకంలో అలాగే రాసిందని వేణు స్వామి చెప్పుకొచ్చారట .
ఈ క్రమంలోని రష్మిక అతగాడికి బ్రేకప్ చెప్పేసి ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది . అయితే ఇదే క్రమంలో రష్మిక కి ఆల్రెడీ వేణు స్వామి ఓ స్టార్ హీరో విషయంలో హెచ్చరించారని ..అయినా కానీ ఆమె మాట వినకుండా అలా చేయడంతోనే ఇప్పుడు కెరియర్ డిజాస్టర్ గా మారిపోయింది అని చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే వేణు స్వామి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”రష్మిక – విజయ్ దేవరకొండకు దూరంగా ఉండటమే బెటర్ అని ఎప్పుడో చెప్పుకొచ్చాను. విజయ్ జాతకం ప్రకారం ఆయనతో ఎవరు కలిసిన సరే వాళ్ళ కెరియర్ నాశనం అయిపోతుంది. అదే విషయం నేను రష్మిక కు చెప్పాను .. కానీ నా మాట వినలేదు ..అందుకే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తుంది . ఇప్పటికైనా రష్మిక ఆలస్యం చేయకుండా విజయ్ దేవరకొండకు దూరం కావడమే మంచిది.. లేకపోతే ఆమెకి దరిద్రం పట్టుకుంటుంది” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!