Moviesటాలీవుడ్‌లో విషాదం.. క్యాన్స‌ర్‌తో యంగ్ డైరెక్ట‌ర్ మృతి

టాలీవుడ్‌లో విషాదం.. క్యాన్స‌ర్‌తో యంగ్ డైరెక్ట‌ర్ మృతి

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ యువ దర్శకుడు క్యాన్సర్ తో మృతి చెందారు. ప్రముఖ దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్‌కు ఆయన సీతారామ్‌ గా పరిచయం.

సీతారామ్‌ ఆర్యన్ రాజేష్ హీరోగా తెర‌కెక్కిన నిరీక్షణ సినిమాతో మెగాఫోన్ పెట్టి ద‌ర్శ‌కుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత సీనియర్ హీరో శ్రీకాంత్తో శత్రువు – నవదీప్ తో నటుడు అనే సినిమాలను రూపొందించారు. తాజాగా ఆయన దర్శకత్వంలోతెర‌కెక్కిన రెక్కీ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఈ సమయంలోనే ఆయన క్యాన్సర్ తో మృతి చెందటం బాధాకరం. ఆయన మృతికి ఇండస్ట్రీకి చెందిన పలువురు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్‌గా.. ఘోస్ట్ రైటర్ గా కూడా పనిచేశారు. సీతారామ్‌ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news