Moviesఅభిమానుల గుండెలు ముక్కలైయే న్యూస్.. విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్ స్టార్...

అభిమానుల గుండెలు ముక్కలైయే న్యూస్.. విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు అన్న పదం ఎంత కామన్ గా వినిపిస్తూ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకొని సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నారు .అభిమానుల్ని కన్నీరు పెట్టిస్తున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ అందరూ బడా ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలు విడాకులు తీసుకుంటూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

రీసెంట్గా మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక సైతం తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుండి విడాకులు తీసుకుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . అయితే త్వరలోనే ఇండస్ట్రీలో ఉండే మరో స్టార్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకోబోతుంది అన్న ప్రచారం ఇప్పుడు ఊపందుకునింది. ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రిలో స్టార్ బ్యూటిగా పేరు సంపాదించుకున్న ఓ ముద్దుగుమ్మ ..త్వరలోనే విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

ఇప్పటికే భర్తకు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ డివర్స్ కి కూడా ఫైల్ పిటిషన్ చేసిందని ..త్వరలోనే దీనిపై క్లారిటీ రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో జనాలు చెప్పుకొస్తున్నారు. కాగ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగానే విడాకులు తీసుకోబోతుంది అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో మరో స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకోబోతుంది అన్న వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news