సాధారణంగా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే కచ్చితంగా గొడవ పడుతూ ఉంటారు . అన్నా – చెల్లెలు.. అక్క – తమ్ముడు ..ఎవరైనా సరే ఇలా గొడవ పడడం చాలా కామన్ గా ఉంటుంది . ఇప్పుడు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోలు కూడా ఒకప్పుడు తమ ఇంట్లోని సిబ్లింగ్స్ తో గొడవపడి ..అల్లరి చేసిన మూమెంట్స్ ఎన్నో ఉంటాయి. కాగా అలాంటి ఓ మూమెంట్ ని సరదాగా బయటపెట్టాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .
సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న రామ్ చరణ్ ..ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు . అయితే చరణ్ మొదటి నుంచి చాలా సరదా సరదాగా ఉంటాడన్న విషయం తెలిసిందే ..కోపం కూడా ఎక్కువే . ఈ క్రమంలోని చిన్నప్పుడు తన అక్క సుస్మితతో తరచూ పోట్లాడుతూనే ఉండే వారట చరణ్. సుస్మిత ఏ బొమ్మ తీసుకుంటే ఆ బొమ్మ కావాలని ..సుస్మిత ఏ వస్తువు అడిగితే అదే వస్తువు కావాలని.. చాలా మొండి చేసేవాడట . ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సరదాగా వీళ్లిద్దరిని ఏడిపించిన మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చారు .
అదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. చిన్నతనంలో రామ్ చరణ్ కు సుస్మితకు గొడవలు పెట్టింది నేనే అంటూ చాలా ఫన్నీగా చెప్పుకొచ్చారు. చిరంజీవి ఇంట్లోనే పవన్ కళ్యాణ్ ఉండేవాడు అని అందరికీ తెలిసిందే. అయితే సినిమాల్లోకి రాకముందు పిల్లల బాగోగులు చూసుకునేది పవన్ కళ్యాణ్. కాగా ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కొన్ని సార్లు సరదాగా టైం పాస్ అవడం కోసం పిల్లల్ని ఆటపట్టించడం కోసం చరణ్ వద్దకు వెళ్లి “సుస్మిత నీ గురించి మమ్మీతో ఇలా చెప్తుంది ..నువ్వు బ్యాడ్ బాయ్ పనులు చేస్తున్నావంటూ కంప్లైంట్ ఇస్తుంది” అంటూ చెప్పుకు వచ్చేవారట .
అదే క్రమంలో సుస్మిత వద్దకు వెళ్లి “నువ్వు ఇంత బ్యాడ్ గర్ల్ నా..? ఇలాంటి పనులు చేస్తున్నావా..? మమ్మీకి నీ గురించి చరణ్ చెప్తున్నాడు”..అంటూ చెప్పేవారట. ఈ క్రమంలోనే మొదటి నుంచి ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లా పోట్లాడుకునే చరణ్ – సుస్మిత – పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మేసి తెగ పోట్లాడుకునే వారట . జుట్టూలు పట్టుకొని కొట్టుకునే స్థాయికి కూడా వెళ్ళిపోయారట . అయితే చిన్నతనంలో ఇవన్నీ చాలా సరదాగా ఉంటాయన్న విషయం అందరికీ తెలిసిందే.
మనలో కూడా చాలామంది అక్కలతో- చెల్లెలితో – తమ్ముళ్ళతో – అన్నలతో గొడవపడే ఉంటాం . ఆ మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు.. ప్రెసెంట్ చరణ్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే.. సుస్మిత ప్రొడక్షన్ హౌస్ లో ఇప్పుడిప్పుడే సెటిల్ అవ్వడానికి చూస్తుంది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలను ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తున్నాడు..!!