Moviesత్వరలోనే ఆ హీరోయిన్ విడాకులు.. తేల్చి చెప్పేసిన వేణుస్వామీ..!!

త్వరలోనే ఆ హీరోయిన్ విడాకులు.. తేల్చి చెప్పేసిన వేణుస్వామీ..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఆస్ట్రాలజర్ వేణు స్వామి పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా సమంత – నాగచైతన్య విడాకులు తీసుకున్నప్పటినుంచి లైమ్ లోకి వచ్చాడు వేణు స్వామి . కాగా ఆ తర్వాత ఆయన చెప్పినవి కూడా చెప్పినట్లు జరుగుతూ ఉండడంతో కేవలం సామాన్య జనాలే కాదు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఆయన మాటలను నమ్మేస్తున్నారు . ఈ క్రమంలోనే ఇప్పటికే ఆయన టాలీవుడ్ – బాలీవుడ్ – కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో హీరోయిన్ల జాతకాలను ముందుగానే చెప్పేశారు . ఇలాంటి క్రమంలోనే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జాతకం గురించి ముందే వివరించారు వేణు స్వామి.

కాగా రకుల్ ప్రీత్ సింగ్ తన కెరియర్ లో బిగ్ రాంగ్ స్టెప్ తీసుకుంటుందని.. ఆమె జాతకం ప్రకారం ఆమెకు పెళ్లి కలిసి రాదని.. ఆమె పెళ్లి చేసుకున్నాక కచ్చితంగా డివర్స్ తీసుకుంటుందని ..ఆమె జాతకంలో అలాగే రాసి ఉందని.. బల్లగుద్ది చెప్పారు . అంతేకాదు ఆమె లైఫ్ లోకి ఓ వ్యక్తి వచ్చాక ఆమె కెరియర్ డౌన్ ఫాల్ అవుతుందని సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతాయని ముందుగానే హెచ్చరించారు . అయితే రీసెంట్ ఇంటర్వ్యూలను రకుల్ ప్రీత్ సింగ్ తనకు అవకాశాలు రావడం లేదు అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది .

ఇదే క్రమంలో వేణు స్వామి చెప్పిన మాటలు నిజంగానే జరుగుతున్నాయి అంటూ ప్రచారం చేస్తున్నారు జనాలు . అంతేకాదు రకుల్ ప్రీత్ సింగ్ ముందుగానే ఆలోచించి తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పేసుకోవడమే బెటర్ అని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం కన్నా ముందే బ్రేకప్ చెప్పుకోవడం మంచి పద్ధతి అని చెప్తున్నారు. అయితే మరి కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఎవరో ఏదో చెప్పారని ముందుగానే భయపడి పోయి బ్రేకప్ చెప్పేసుకోవాలా ..? అంటూ ఫైర్ అవుతున్నారు. మొత్తానికి వేణు స్వామి చెప్పినట్టే సినిమా ఇండస్ట్రీలో జరుగుతూ ఉండడంతో గతంలో వేణు స్వామి ఓ స్టార్ హీరోయిన్ మరణిస్తుంది అని చెప్పుకొచ్చారు . ఆ హీరోయిన్ ఎవరా..? అంటూ ఆరా తీస్తున్నారు. రకరకాల పేర్లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news