Moviesఈ ఫొటో వెన‌క సీక్రెట్ ఏంటో చెప్పిన ఊర్వ‌శి రౌతేలా...!

ఈ ఫొటో వెన‌క సీక్రెట్ ఏంటో చెప్పిన ఊర్వ‌శి రౌతేలా…!

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఇటీవ‌ల‌ టాలీవుడ్‌లో ప‌లు సినిమాల‌లో ఐటెం సాంగ్స్‌లో న‌టిస్తోంది. ఊర్వ‌శి ఐటెం సాంగ్స్‌కు మ‌నోళ్లు బాగా అల‌వాటు ప‌డిన‌ట్టు ఉన్నారు. ఈ సంక్రాంతికి వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ మూవీ వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ ఓ సంచలనం అయ్యింది. ఈ సాంగ్‌లో ఊర్వశి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అస‌లు ఆమె అందాల‌కు అయితే టాలీవుడ్ కుర్ర‌కారు బాగా ఫిదా అయిపోయారనే చెప్పాలి. ఆ త‌ర్వాత ఆమె అఖిల్ అక్కినేని పాన్ ఇండియన్ మూవీ ఏజెంట్‌లో ప్రత్యేక పాటలో నటించి త‌న అంద‌చందాల‌తో ఓ ఊపు ఊపేసింది. తాజాగా ఈ నటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో మొదటి సింగిల్ మై డియర్ మార్కండేయలో కనిపించి ఒక్క‌సారిగా ట్విస్ట్ ఇచ్చింది.

లేటెస్ట్ మ్యాట‌ర్ ఏంటంటే తాజాగా ఊర్వ‌శి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో దిగిన ఒక స్వీట్ సెల్ఫీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ లో కాస్త గెడ్డంతో కనిపించిన పవన్ లుక్స్‌కు ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు. అంతే కాకుండా ఊర్వ‌శి ప‌వ‌న్‌తో దిగిన సెల్ఫీ ఫొటో పోస్ట్ చేయ‌డంతో పాటు కామెంట్ కూడా పెట్టింది.

ఈ చిత్రంలో తాను భాగస్వామిని కావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని… ప‌వ‌న్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి మిమ్మల్ని స్వాగతిస్తున్నాము, మా సినిమా బ్రో ది అవతార్ జూలై 28న రిలీజ్‌కు రెడీగా ఉంద‌ని ఊర్వశి పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం వీరిద్దరి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news