Moviesత్రిష పెళ్లి క్యాన్సిల్ అయితే పార్టి చేసుకున్న ఆ తెలుగు హీరో.....

త్రిష పెళ్లి క్యాన్సిల్ అయితే పార్టి చేసుకున్న ఆ తెలుగు హీరో.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే..!?

ప్రేమ అన్నాక కొన్నిసార్లు గెలుస్తుంది .. మరి కొన్నిసార్లు ఓడిపోతుంది ..ఇవంతా ఓల్డ్ డైలాగ్స్ . ప్రేమ అనేది ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది.. ఈ మధ్యకాలంలో ప్రేమ అన్నదానికి చీటింగ్ అనే పేరును కూడా పెట్టుకోచ్చారు నేటి యువత. అలా ప్రేమ అనేదాన్ని ప్రేమ అనే పదాన్ని బ్రష్టు పట్టించేశారు కొందరు ప్రేమికులు. తమ కోరికల కోసం ప్రేమ అనే పదాన్ని వాడుకుంటూ సర్వనాశనం చేసేసారు . కాగా రీసెంట్గా అలాంటి కామెంట్స్ త్రిషపై వినిపిస్తున్నాయి . సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న త్రిష కెరియర్ స్టార్టింగ్ లో ఎంతో మంది హీరోలతో ప్రేమాయణం నడిపింది అంటూ వార్తలు వినిపించాయి .

అయితే ఫైనల్లీ త్రిష బిజినెస్మేన్ వరుణ్ మానియన్ తో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది . ఆయనతో నిశ్చితార్థం కూడా చేసుకుంది. రేపో మాపో పెళ్లి అనగా పెళ్లిని క్యాన్సిల్ చేసుకునేసింది. త్రిష ఇప్పటివరకు అసలు ఎందుకు వీళ్ళు నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నారనే విషయం క్లారిటీనే లేదు . అయితే సోషల్ మీడియాలో కోలీవుడ్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. త్రిష గురించి అసలు నిజం తెలుసుకునే వరుణ్ మానియన్ లాస్ట్ మూమెంట్లో పెళ్లి క్యాన్సిల్ చేశారని పలువురు అంటుంటే .. మరికొందరు త్రిష.. వరుణ్ మానియన్ నిజస్వరూపం తెలుసుకొని ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేసింది అని చెప్పుకొస్తూ ఉంటారు.

అయితే వీళ్ళిద్దరూ పెళ్లి జరగకుండా క్యాన్సిల్ అయిపోయినందుకు అప్పట్లో ఓ స్టార్ హీరో ఫ్రెండ్స్ అందరికీ పిలిచి మరి పార్టీ ఇచ్చాడట . దానికి కారణం త్రిష చేతిలో ఆయన కూడా మోసపోవడమే. ఆయనతో సినిమా చేసే టైంలో త్రిష ఆయనకు చాలా క్లోజ్ అయిపోయింది . ఎంతలా అంటే పబ్బుల్లో పార్టీలో చట్టపట్టలేసుకొని తిరిగారు . అయితే వీళ్ళ మధ్య ప్రేమ ఉంది అని జనాలు నమ్మేలోపే వీళ్లిద్దరు విడిపోయారు . దీంతో నమ్మించి మోసం చేసిన త్రిష పెళ్లి పెటాకులైన కారణంగా ఫుల్ ధూంధాం పార్టీ ఇచ్చారట ఆ స్టార్ హీరో. ఇప్పటికీ ఆ పార్టీని వాళ్ళ ఫ్రెండ్స్ మర్చిపోలేనంత హై రేంజ్ లో సెలబ్రేట్ చేశారు అంటే త్రిష లైఫ్ లో డౌన్ అవ్వడం ఆ హీరోకి ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news