టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సినీ బ్యాగ్రౌండ్ తో అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా బేబీ సినిమా తెరకెక్కింది. ఈ బేబీ సినిమా ఈ నెలలోనే రిలీజ్ కానుంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారు ఆనంద్, వైష్ణవి.
ఈ సినిమా ప్రమోషన్లోనే ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ సురేష్ కొండేటి చేసిన ఇంటర్వ్యూలో వైష్ణవి పాల్గొంది. కాగా ఈ ఇంటర్వ్యూలో సురేష్ కొండేటి మాట్లాడుతూ ” వైష్ణవి ముద్దు పెట్టుకుంటా ” అంటాడు. దీంతో వైష్ణవి షాకై అలానే చూస్తూ ఉండిపోతుంది. కొంతసేపటికి ఇది మీ మూవీలో డైలాగ్ అని సురేష్ కొండేటి అనడంతో ఓ టీజర్లో ఉన్న సీన్ అని వైష్ణవి రిలాక్స్ అవుతుంది.
ఈ క్రమంలో డైలాగ్ చివర్లో ” చెప్పు తెగిపోద్ది ” అంటాను అంటూ వైష్ణవి చెప్పడంతో సురేష్ కొండేటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. అయితే ఈ డైలాగ్ కూడా హీరోయిన్ చెప్పుతుందట. దీనిని ప్రమోషన్ కోసం వాడుకున్నారా ? లేదా ? అన్నది క్లారిటీ లేదు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలా మంది నెటిజన్లు నీ వయసెంత? ఆమె వయసెంత? నీకు అవసరమా ఇలాంటి డైలాగులు అంటూ సురేష్ కొండేటిని ట్రోల్స్ చేస్తున్నారు.
సురేష్ కొండేటి మెగా ఫ్యామిలీకి, ఇంకా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవికి పర్సనల్ పీఆర్వోగా ఉంటున్నారు. మెగాస్టార్‌కు వీరాభిమాని కూడా… మొత్తానికి సురేష్ కొండేటి ఇటీవల ఇలాంటి కాంట్రవర్సీ ప్రశ్నలతో తన పరువుతో పాటు మెగాస్టార్‌కు దగ్గరగా ఉంటానని చెప్పుకుంటూ ఆయన పరువు కూడా తీసేస్తున్నారన్న విమర్శలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.