సినిమా ఇండస్ట్రీలో .. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత ..ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ స్థానాన్ని సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే . అఫ్ కోర్స్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్న సమంత ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలేసిన నెంబర్ వన్ హీరోయిన్ అన్న విషయం మనం మర్చిపోకూడదు . ఇప్పటికీ ఆమెకు టాప్ రేంజ్ లో క్రేజ్ ఉంది . అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఒక్కటే ఆమెను నెగిటివ్గా చూసే అంశం . కాగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతే అమ్మడు ఈ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది .
ఒకవేళ ఇప్పటికి అక్కినేని కోడలుగా ఉంటే ఇండస్ట్రీలో దేవతల ట్రీట్ చేసేవారు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇలాంటి క్రమంలోనే సమంతని ట్రోల్ చేసే కొందరు వ్యక్తులు ఆమెకు సంబంధించిన మరికొన్ని విషయాలను ట్రెండ్ చేస్తున్నారు . సమంత చిన్నప్పటినుంచి చాలా యాక్టివ్ గా ఉండేదట. మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఆత్రుత ఎక్కువగా ఉండేదట. మేకప్స్ వేసుకోవడం.. స్టైల్ గా నడవడం ..లగ్జరీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవడం అంటే తెగ ఇంట్రెస్ట్ .
అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా సమంత లిమిట్స్ లోని ఉండేవారు అంటూ చెప్పుకొస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోని ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణంగా సమంత చిన్నప్పటినుంచి ఇంట్లో పనులు చేయడం మొదలుపెట్టిందట . కుకింగ్ .. క్లీనింగ్ అన్నీ కూడా సమంత చిన్నతనం నుంచే నేర్చుకునేదట . జనరల్ గా ఇలాంటివన్నీ ఇంట్లో ఆడపిల్లలకి ఒక వయసు వచ్చాక నేర్పిస్తారు . అయితే సమంత కుటుంబం పరిస్థితి బాగోలేని కారణంగా ఆమెకు చిన్నతనం నుంచి అన్ని పనులు నేర్పించారట ఇంట్లోని కుటుంబ సభ్యులు . ఈ క్రమంలోనే చైల్డ్ హుడ్ బాగా మిస్ అయిన సమంత ఆ అల్లరిని మొత్తం సినిమాలోకి వచ్చాక ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిందట . మొత్తానికి చిన్ననాటి నుంచి సమంత కష్టాలు పడుతూనే ఉంది . చిన్నప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ..పెళ్లయ్యాక రెస్ట్రిక్షన్స్ ..ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ..సమంత హ్యాపీగా ఉండే డేస్ ఉన్నాయో లేవో..?