టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత సినిమాలకు బ్రేక్ చెప్పిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఇదే విషయాన్ని సమంత పిఆర్ టీం అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది . ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ వేయాలని అనుకుంటున్నారు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో సమంత పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది.
కాగ నాగచైతన్యతో డివర్స్ తీసుకున్న తర్వాత సమంత లైఫ్ ఊహించిన విధంగా మలుపు తిరిగింది. అప్పటిలా అవకాశాలు రావడం లేదు ..వచ్చిన అవకాశాలు సైతం చేజారిపోతున్నాయి . ఈ క్రమంలో ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కడుతున్నాయి . దీనితో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సమంత కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేయాలని నిర్ణయించుకుందట .
ప్రజెంట్ సమంత చేతిలో రెండే రెండు ప్రాజెక్టులు ఉన్నాయి . ఒకటి శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి.. మరొకటి బాలీవుడ్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడిల్ వెబ్ సిరీస్ . ఈ రెండు షూటింగ్స్ కంప్లీట్ అయిపోగానే సమంత సుదీర్ఘంగా బ్రేక్ తీసుకోబోతుంది అంటూ పిఆర్ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది . దీనితో సమంత హెల్త్ కండిషన్ మళ్ళీ బాగోలేదా అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి . దీనిపై సమంత నోరు విప్పితేనే బాగుంటుంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు..!!