Moviesసడెన్ గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చిన సమంత కొత్త...

సడెన్ గా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చిన సమంత కొత్త మొగుడు..కేక పెట్టిస్తున్న కటౌట్ ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత ఎంత చక్కగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏం మాయ చేసావే సినిమా దగ్గరనుంచి సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ .. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకునింది. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ జంట విడాకులు తీసుకుని దూరం దూరంగా బ్రతుకుతున్నారు . కాగ ఇదే క్రమంలో సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి .

మరి ముఖ్యంగా సమంత రెండో పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త ర్లా ట్రెండింగ్ అవుతుందో మనకు తెలిసిందే . కాగా సడన్ గా ఎవరు ఊహించిన విధంగా సమంత రెండో భర్తకి సంబంధించిన వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే.. సమంత ప్రెసెంట్ విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమాలో నటిస్తుంది. శివనిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు .

కాగా ఫుల్ లవ్-రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే చిత్ర ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది . దీనికి సంబంధించిన వీడియో ని రిలీజ్ చేస్తూ మేకర్స్ సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ క్రమంలోనే ఈ వీడియోలో సమంత – విజయ్ దేవరకొండ పట్టు వస్త్రాలలో భార్యాభర్తల్లా కనిపించారు.

తెల్లటి పంచ తెల్లటి చొక్కా లో విజయ్ దేవరకొండ కొత్త పెళ్లికొడుకులా కనిపిస్తూ ఉంటే ..పక్కనే సమంత మెడలో నల్లపూసల దండ వేసుకుని ఎర్ర చీరలో అచ్చం మహాలక్ష్మి లా కనిపించింది . చూడడానికి ఇద్దరు భార్యాభర్తల్లా చాలా చక్కగా ఉన్నారు. ఈ జోడి బాగుంది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అంతేకాదు సమంత- విజయ్ ని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ఎవరు ఊహించిన విధంగా సడన్గా సోషల్ మీడియాలో సమంత కి కొత్త మొగుడు గా విజయ్ దేవరకొండ వస్తే బాగుంటుంది అంటూ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఏ మాటకు ఆ మాట ఈ ఇద్దరు జోడి సూపర్ అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news