ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో మెగా డాటర్ నిహారిక విడాకుల వార్త ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏం జరిగినా సరే ..నిహారిక విడాకులకి లింక్ పెడుతూ హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు జనాలు. అలాగే ఇప్పుడు ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సదాకు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .
సెకండ్ ఇన్నింగ్స్ లో బడా అవకాశాలు పట్టలేకపోతున్నా.. మంచి నటిగా మాత్రం పేరు సంపాదించుకుంది . ఇలాంటి క్రమంలోనే ఇంత ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదు ఏంటి సదా అంటూ చాలామంది మాట్లాడుకుంటూ ఉంటున్నారు. దీనికి సమాధానం ఇచ్చింది సదా. ” పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్రీడం ఉండదు.. నాకు నచ్చింది నేను చేయలేను.. అందుకే నేను పెళ్లి చేసుకోదలుచుకోవట్లేదు ..మనల్ని అర్థం చేసుకుని.. మనకి ఫ్రీడమ్ ఇచ్చే వ్యక్తి మన లైఫ్ లోకి వచ్చినప్పుడు .. ఆ లైఫ్ బాగుంటుంది.. అలాంటి వ్యక్తి కోసం చూస్తున్న ..అయినా ఇటీవల కొంతమంది గ్రాండ్ గా పెళ్లిళ్లు చేసుకొని విడిపోతున్న సంఘటన చూస్తూనే ఉన్నాం ..అలా విడిపోవడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడమే చాలా చాలా బెటర్ ” అంటూ కూసింత ఘాటుగానే వ్యాఖ్యానించింది .
అయితే సోషల్ మీడియాలో సదా చేసిన ఈ కామెంట్స్ హీరోయిన్ సమంత – మెగా డాటర్ నిహారికకు ఆప్ట్ గా సెట్ అవుతాయని .. ఆమె చెప్పింది నిజమే అని ..వీళ్ల లా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం కన్నా సింగిల్ గా ఉండటమే బెటర్ అంటూ సదా కామెంట్స్ ని ట్రెండ్ చేస్తున్నారు . దీంతో సదా కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి…!!