టాలీవుడ్ యంగ్‌రెబల్ స్టార్ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసి పడేస్తున్నాడు. వరుస పెట్టి క్రేజీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. రీసెంట్గా గత నెలలో ఆదిపురుష్ లాంటి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ త్వరలోనే రెండు క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. వాటిల్లో ముందుగా సెప్టెంబర్ 28న సలార్ వస్తోంది.
అసలు సలార్ టీజర్‌తోనే పీక్స్ కు వెళ్లిపోయింది. ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సలార్ మానియా అయితే మామూలుగా లేదు. సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తోన్న సినిమా ప్రాజెక్ట్ కే. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాత చలసాని అశ్వీనీదత్ భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ రు.500 కోట్ల పై మాటే అని టాక్ ?
ఇక ప్రాజెక్ట్ కే అంటే ఏంటన్నది ముందు నుంచి పెద్ద సస్పెన్స్‌గా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. “ప్రాజెక్ట్ కల్కి” అనేది ఇప్పటి వరకు బాగా హైలైట్ అయ్యింది. ఈ సినిమా కాన్సెప్ట్ అనుగుణంగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ బయటకు వచ్చింది. ప్రాజెక్ట్ కే అంటే “ప్రాజెక్ట్ కాలచక్ర” అట. మరి ఈ సినిమా కథకు గతం, భవిష్యత్తు, వర్తమానానికి లింకప్ అయ్యి ఉంటుందట.
గతంలో బాలయ్య నటించిన బ్లాక్‌బస్టర్ ఆదిత్య 369 మూవీలోనూ గతం, వర్తమానం, భవిష్యత్తుపై కథ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా కథ కూడా అదే స్టైల్లో ఉంటుందంటున్నారు. ఇక ఆదిత్య 369 డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కూడా ఈ ప్రాజెక్ట్ కే కోసం సలహాలు, సూచనలు ఇస్తున్నారు.