రెబల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా..? అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన క్షణం రానే వచ్చేసింది . పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సలార్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. కాగా కేజిఎఫ్ లాగే ప్రశాంత్ నీల్ ఈ సినిమాని కూడా రెండు పార్టులుగా తెరకెక్కించబోతున్నాడు అంటూ ప్రకటించేసాడు. కొద్దిసేపటి క్రితిమే రిలీజ్ అయిన సలార్ టీజర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
ఈ చిత్ర టీజర్ ని ఉదయం విడుదల చేశారు మేకర్స్/ అభిమానులను ఈ చిత్ర టీజర్ తెగ అట్రాక్ట్ చేస్తుంది . ఇందులో ఓ ఫ్యాక్టరీలో వందల మంది ఒకరిని చంపేందుకు తుపాకులతో ట్రై చేస్తూ ఉంటారు.. చుట్టుముడుతారు అప్పుడు ఓ వృద్ధుడు వారికి ఒక కథ చెప్తూ ఉంటాడు ..”సింహం – టైగర్ – చిరుత – పులి – ఎలిఫెంట్ వెరీ డేంజరస్.. కానీ అది జురాసిక్ పార్క్ లో కాదు.. ఆ పార్క్ లో ఒక..”.. అంటూ ప్రభాస్ ని చూపించడం విశేషం .
అంతేకాదు కత్తులతో ప్రత్యర్థులపై ప్రభాస్ వీరంగం సృష్టించడం మనం ఈ టీజర్ లో చూడొచ్చు. ప్రభాస్ మొత్తానికి ఈ సినిమా ద్వారా మనలికి మరో చత్రపతి సినిమాను గుర్తు చేస్తున్నాడు . యుద్ధ రంగంలో ఆయన విరుచుకుపడిన సీన్స్ అభిమానులకు గూస్ బంప్స్ తప్పించేలా ఉన్నాయి. మరి ముఖ్యంగా బీజీఎమ్ఈ సినిమాకి హైలెట్గా నిలవబోతోంది అంటూ చిన్న టీజర్ తోనే అర్థం అయిపోయింది . ఆద్యంతం క్షన్ ఎలివేషన్ తో సాగిన ఈ టీజర్ తో ఈ సినిమా హిట్ అయిపోతుంది అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సెప్టెంబర్ 28న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సల్లార్ సినిమా రిలీజ్ కాబోతుంది . చూడాలి మరి ఈ సినిమా ద్వారా ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ని ఏ విధంగా షేక్ చేయబోతున్నాడో..?