News"కృతజ్ఞత లేని వెధవ"..హీట్ పెంచేసిన డైరెక్టర్ మారుతి ట్వీట్.. సోషల్ మీడియాలో...

“కృతజ్ఞత లేని వెధవ”..హీట్ పెంచేసిన డైరెక్టర్ మారుతి ట్వీట్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రెటీస్ పై ఫ్యాన్స్ ఎలా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు మనకు బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా తమ ఫేవరెట్ స్టార్ హీరోని పట్టించుకోకపోయినా పుట్టినరోజుకు విష్ చేయకపోయినా తమ హీరోని.. కాదని మరో హీరోతో సినిమా చేస్తున్న సోషల్ మీడియాలో దారుణంగా పేరుని ట్యాగ్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు కొందరు స్టార్ హీరోల ఫ్యాన్స్ . ఆ లిస్ట్ లోకి యాడ్ అయిపోయారు టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ అభిమానులు . ప్రజెంట్ ప్రభాస్ అభిమానులు ఎంత హ్యాపీగా ఉన్నారో మనకు బాగా తెలిసింది. ఆయన కెరియర్ లో ఫస్ట్ టైం సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కిన సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు .

రీసెంట్ గా ప్రాజెక్టుకే గ్లింప్స్ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది . దీనిపై ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ప్రభాస్ ను ఓ రేంజ్ లో పొగిడేస్తూ కామెంట్స్ చేశారు . అయితే ప్రభాస్ తో సినిమా చేసే డైరెక్టర్ మారుతి మాత్రం అసలు ఆయనను పట్టించుకోలేదు . కనీసం గ్లింప్స్ బాగుంది అని.. ప్రభాస్ నటన బాగుంది అని ఏదో ఒకటి మాట్లాడి ఉంటే మ్యాటర్ సాల్వ్ అయ్యేది .

కానీ మారుతి మాత్రం అస్సలు ప్రభాస్ గురించి పట్టించుకోలేదు. పోనీ అంతవరకు వదిలేసిన .మారుతి ఎదో బిజీగా ఉన్నాడు అనుకోని వదిలేసేవారు. రీసెంట్గా అల్లు అర్జున్కి సంబంధించి ఆయన ని ప్రశంసిస్తూ ఐకాన్ స్టార్ అంటూ పొగిడేసారు. దీంతో ప్రభాస్ అభిమానులకు మండిపోయింది . బేబీ సినిమా సక్సెస్ ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ మారుతి అటెండ్ అయ్యారు . ఈ క్రమంలోనే బేబీ సినిమా గురించి బన్నీ మాట్లాడిన మాటలు షేర్ చేసి ఆయనని ఓ రేంజ్ లో పొగిడేసారు మారుతి.

అయితే ఆయనకు సినిమా అవకాశం ఇచ్చిన ప్రభాస్ గురించి కల్కి గ్లింప్స్ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు . దీంతో మారుతిని నమ్మకద్రోహి అని కృతజ్ఞతలు లేని వ్యక్తి అని బూతులు తిడుతున్నారు ప్రభాస్ అభిమానులు . అంతేకాదు నీలాంటి వాడికి ఛాన్స్ ఇచ్చి ప్రభాస్ అన్న తప్పు చేశాడు అంటూ ఫైర్ అవుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news