సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాడ్‌గా తెరకెక్కిన సినిమా బ్రో. దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన సాలిడ్ డివోషనల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ శుక్రవారం థియేటర్లలోకి దిగింది. డీసెంట్ బజ్ మధ్య రిలీజ్ అయిన బ్రో ఫస్ట్ డే కాస్త మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో పవన్ ఉన్నా మరీ ఆహా ఓహో అనే రేంజ్లో లేదనే అందరూ అన్నారు.
అయితే డే 1 సాయంత్రం నుంచి సాలిడ్ ఆక్యుపెన్సీ సెట్ చేసుకుని దూసుకుపోతోంది. బ్రో మొదటి రోజే సుమారు 30 కోట్ల మేర షేర్ అందుకోగా… వరల్డ్ వైడ్ రెండో రోజు అయితే ఊహించని వసూళ్లు రాబట్టింది. రెండో రోజు ఏకంగా రు. 20 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అంటే రెండు రోజుల్లో రు 50 కోట్ల షేర్ అంటే సెన్షేషనల్ అని చెప్పాలి.
ఇక మూడో రోజు ఆదివారం అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా అదిరిపోతున్నాయి. ఇక రీసెంట్ టైమ్స్‌లో రెండో రోజు 20 కోట్ల షేర్ అందుకున్న అతి తక్కువ సినిమాల్లో బ్రో ఒకటిగా నిలిచినట్లయ్యింది. మొత్తానికి అయితే ఇక నుంచి బ్రో మాస్ బ్యాటింగ్ స్టార్ట్ అయ్యింది. మిక్స్ డ్ టాక్‌తో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పవన్‌కే సాధ్యమైంది.