టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎప్పుడు యాక్టివ్ గా హెల్త్ పరంగా కేరింగ్ గా ఉండే సమంత ఇలాంటి వ్యాధికి గురి అవ్వడంతో జనాలు షాక్ అయిపోయారు . అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుంది .. ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటూ అప్పట్లో ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసేవారు. అయితే ఈ వ్యాధి శక్తికి మించిన బరువులు మోయడం ద్వారా.. ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడం ద్వారా వస్తుంది అని కొందరు డాక్టర్లు తేల్చి చెప్పారు .
అలాంటి మరో అరుదైన వ్యాధికి గురైనట్లు హీరోయిన్ నందిత శ్వేత ఓపెన్ గా చెప్పుకొచ్చింది . మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నా కొందరు ముద్దుగుమ్మలను జనాలు తెగ లైక్ చేస్తూ ఉంటారు . వాళ్ళు హిట్లు కొట్టిన ఫ్లాపులు తమ ఖాతాలో వేసుకున్న ఆ హీరోయిన్స్ ని దేవతలా చూస్తూ ఉంటారు . వాళ్లలో ఒకరే నందిత శ్వేత .. రీసెంట్గా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నందిత శ్వేత మాట్లాడుతూ..” స్టార్ట్ డం అనేది ఎవరి చేతుల్లో ఉండదు.. వచ్చిన పాత్రలు చేయడమే ఓ నటికి ఇంపార్టెంట్ .. నేను ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి. ” అంటూ చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆమె ఒక అరుదైన వ్యాధికి గురైందని “ఫైబ్రోమల్జియాతో” ఇబ్బంది పడుతున్నాను అని.. దీనివల్ల ఎక్కువ వర్కౌట్స్ డైట్ చేయకూడదని నిద్రలేకుండా అస్సలు ఉండకూడదని కానీ “హిడింబ” సినిమా కోసం మాత్రమే ఇవన్నీ జరిగాయని.. ఎంత స్ట్రగుల్ పడ్డానో నాకు తెలుసు” అంటూ ఎమోషనల్ అయింది . దీంతో సోషల్ మీడియాలో నందిత శ్వేతా కామెంట్స్ వైరల్ గా మారాయి . అంతేకాదు నందితే శ్వేతాకి కూడా సమంత అలాగే అరుదైన వ్యాధి ఉంది అని తెలియడంతో జనాలు షాక్ అయిపోతున్నారు..!!