టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. కాగా నందమూరి నటవారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన ఈ హీరో “నిన్ను చూడాలని” అనే సినిమాతో మంచి హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే రికార్డులు నెలకొల్పాడు. ఆ తర్వాత హిట్లు ప్లాపులు అంటూ సంబంధం లేకుండా వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా .. తర్వాత పాన్ ఇండియా హీరోగా ఇప్పుడు గ్లోబల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న తారక్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
తారక్ కోపం ఎక్కువే ..ఎంత కోపం చూపిస్తాడో.. అంతకంటే డబల్ స్థాయిలో ప్రేమ – జాలి కూడా చూపిస్తారు . కానీ తారక్ కి కొన్ని కొన్ని మాటలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదట . అందుకే అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే వెంటనే దూరం పెట్టేస్తారట. అంతేకాదు అవి గాని హద్దులు మీరితే ఆయన బీపీ 170 దాటిపోతుందట. తారక్ కి మొదట నుంచి లేడీస్ అంటే చాలా గౌరవం.. అలా పెంచారు వాళ్ళ అమ్మ షాలిని గారు .
అయితే ఎవరైనా సరే అమ్మాయిల పై వల్గర్ డైలాగ్స్ చెప్పిన.. అమ్మాయిల తో అసభ్యంగా ప్రవర్తించిన .. అమ్మాయిల ప్రైవేట్ బాడీ పార్ట్స్ పై చీప్ గా దారుణమైన కామెంట్స్ చేసిన తారక్ అస్సలు ఊరుకోడట . ఎదుట ఉన్నది ఎంతటి వ్యక్తి అయినా సరే చంపచళ్లు మనిపిస్తారట. తారక్ సినిమాల్లో కూడా అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు . అమ్మాయిలను ఎప్పుడు కూడా కించపరిచే విధంగా మాట్లాడరు. ఎవరైనా సరే తన ముందల మాట్లాడితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తారు. ఇలాంటి హీరో మన ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గర్వకారణం అని చెప్పాలి..!!