MoviesTL రివ్యూ: రంగ‌బ‌లి.. ఫ‌స్టాఫ్ హిట్‌.. సెకండాఫ్ ఫ‌ట్‌.. ప్రేక్ష‌కులు బ‌లి

TL రివ్యూ: రంగ‌బ‌లి.. ఫ‌స్టాఫ్ హిట్‌.. సెకండాఫ్ ఫ‌ట్‌.. ప్రేక్ష‌కులు బ‌లి

టైటిల్‌: రంగ‌బ‌లి
బ్యాన‌ర్‌: ఎస్ఎల్‌వీ సినిమాస్‌
న‌టీన‌టులు: నాగ‌శౌర్య‌, యుక్తితరేజా, స‌త్య త‌దిత‌రులు
మ్యూజిక్‌: ప‌వ‌న్ సీహెచ్‌
సినిమాటోగ్ర‌ఫీ: దివాక‌ర్ మ‌ణి, వంశీ పచ్చిపులుసు
ఎడిట‌ర్‌: కార్తీక శ్రీనివాస్‌
నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి
ద‌ర్శ‌క‌త్వం: ప‌వ‌న్ బాసంశెట్టి
రిలీజ్ డేట్‌: 07, జూలై, 2023

యంగ్ హీరో నాగ‌శౌర్య‌కు ఛలో త‌ర్వాత త‌న రేంజ్‌కు త‌గ్గ హిట్ లేదు. తాజాగా రంగ‌బ‌లి ట్రైల‌ర్ వ‌చ్చాక తాను తిరుగులేని క‌మ‌ర్షియ‌ల్ హిట్ కొట్ట‌బోతున్నాన‌నంటూ చెప్పాడు. మ‌రి ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా నాగ‌శౌర్య చెప్పిన‌ట్టు హిట్ అయ్యిందో లేదో చూద్దాం.

స్టోరీ :
శౌర్య అలియాస్ షో (శౌర్య) తన సొంతూరు రాజవరంలో కింగ్ లా బతకాలన్న కోరిక‌తో ఉంటాడు. శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) మెడికల్ షాప్ పెట్టుకుని ఊళ్లో గౌరవంగా బతుకు బండి ఈడుస్తూ ఉంటాడు. కొడుకు భ‌విష్య‌త్తుపై విశ్వం చాలా టెన్ష‌న్‌తో ఉంటాడు. ఈ క్ర‌మంలోనే శౌర్యను వైజాగ్‌ లో మెడికల్ కాలేజ్‌కు పంపుతాడు. అక్క‌డ సహజ (యుక్తి)తో పరిచయం కాస్తా ప్రేమ‌గా మారుతుంది. ఆ తర్వాత శౌర్య ప్రేమకు అతడి ఊరిలోని రంగబలి సెంటర్ అడ్డంకిగా మారుతుంది ? రంగ‌బ‌లి సెంట‌ర్ వ‌ల్లే శౌర్య‌, స‌హ‌జ పెళ్లికి ఆమె తండ్రి అడ్డుప‌డ‌తాడు. ఆ సెంట‌ర్‌కు ఆ రంగ‌బ‌లి అనే పేరు ఎందుకు ? వ‌చ్చింది. ఆ సెంట‌ర్‌కు ఎమ్మెల్యే పరుశురామ్ (షైన్ టామ్ చాకో)కు ఉన్న లింక్ ఏంటి ?, చివరకు ఈ క‌థ ఎలా ఎండ్ అయ్యింద‌న్న‌దే సినిమా.

విశ్లేష‌ణ :
రంగ బలి సినిమాలో సత్య కామెడీ చాలా హైలెట్‌. ముఖ్యంగా సినిమా ఫ‌స్టాఫ్‌లో స‌త్య త‌న‌దైన కామ‌డీ టైమింగ్‌తో మెప్పించాడు. అస‌లు స‌త్య కామెడీ లేక‌పోతే రంగ‌బ‌లి గ్రాఫ్ ఢ‌మాలున ప‌డిపోయి ఉండేది. హీరో నాగశౌర్య తన టైమింగ్ , యాక్షన్ తో బాగా నటించాడు. సినిమాలోని హార్ట్ ట‌చ్చింగ్ సీన్ల‌లో త‌న హావభావాలతో సినిమాను బాగా ర‌క్తి క‌ట్టించాడు. హీరోయిన్ యుక్తి తరేజా పాత్ర‌కు స్కోప్ లేక‌పోయినా గ్లామర్‌తో ఆకట్టుకుంది.

విలన్‌గా షైన్ టామ్ చాకో బాగా నటించారు. కాకపోతే ఆయన పాత్రను ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది. శరత్ కుమార్, మురళీ శర్మ, సత్య, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు.. తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా తండ్రి పాత్రలో గోపరాజు రమణ అద్భుతంగా నటించారు. ఆయన కామెడీ టైమింగ్ తో పాటు ఎమోషనల్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది.

ద‌ర్శ‌కుడు పవన్ తీసుకున్న కథ‌లో సత్య – గోపరాజు రమణ పాత్రలు బాగున్నా కథనం సింపుల్ గా చాలా స్లోగా సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్‌గా లేదు. సిల్లీగా సాగుతుంది. ఇక హీరో, హీరోయిన్ల లవ్ సీన్లు కూడా రెగ్యులర్ గానే ఉంటాయి. క‌థ అంతా రాజవరం ఊరు చుట్టూ న‌డుస్తూ రిపీటెడ్‌గా ఉంటుంది. స్క్రిప్ట్ లో కంటెంట్ స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్లు బాగా రాసుకోవాల్సింది.

అలాగే, ప్రీ క్లైమాక్స్ ను, క్లైమాక్స్ ను ఇంకా బాగా డిజైన్ చేసుకోవాల్సింది. హీరో పాత్ర తీరులోనూ బలం లేదు. ఓవరాల్ గా ఈ సినిమాలో కథాకథనాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఫ‌స్టాఫ్ క‌థ సెట్ చేసుకున్న తీరు బాగున్నా.. సెకండాఫ్ క‌థ‌ను పాత సినిమాల సీన్ల‌తో న‌డిపేశాడు. ఫైన‌ల్‌గ రంగ‌బ‌లి కాస్త ఫ‌న్‌, ఎమోష‌న్ మిక్స్ అయిన రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ డ్రామా.

ఫైన‌ల్ పంచ్‌:
రంగ‌బ‌లి భారీ ఆశ‌ల‌తో వెళితే బ‌లే

రంగ‌బ‌లి రేటింగ్‌: 2.5 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news