ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక అల్లాడిపోతున్న నాగశౌర్య ..ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హై ఎక్స్పెక్టేషన్స్ తో నటించిన సినిమా “రంగబలి”. కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టితో పెద్ద రిస్క్ చేశాడు నాగశౌర్య అనే చెప్పాలి . కాగా ప్రమోషన్స్ ఎంటర్టైనింగ్ సాగడంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అయితే తాను అనుకున్న కథను ప్రేక్షకులకు చెప్పడంలో డైరెక్టర్ పూర్తిగా విఫలమయ్యాడు అని అర్థం అయిపోయింది . కాగా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ నమోదు చేసుకుంది.
గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ అయిన “రంగబలి” సినిమా మొదటి షో తోనే నెగిటివ్ టాక్ సంపాదించుకుంది. అంతేకాదు కథ ప్రకారం కూడా నేటి తరం జనరేషన్ అసలు లైక్ చేయని విధంగా ఉండడం సినిమాకి బిగ్ మైనస్ గా మారింది. ఈ చిత్రం కథ విషయానికి వస్తే.. చావైనా బతుకైనా సంతూరూ లోనే సింహంల బతకాలని ఆశపడే ఓ కుర్రాడు కధ అంటూ తెలుస్తుంది . అయితే ఆ కుర్రాడు ప్రేమ కథ కి ఊరిలో రంగబలి అనే సెంటర్ వల్ల సమస్యలు ఎదురవుతాయి .. అప్పుడు ఆ కుర్రాడు ఏం చేస్తాడు..? తన అనుకున్నది సాధించాడా..? తన ఊరిలోనే సింహంలా బ్రతికాడా..? అన్నది అసలు పాయింట్ . అయితే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ సస్పెన్స్ అనేది ఉండదు . సినిమా ముందుకు పోతూ ఉంటుంది .
ఏదో సినిమా చూశామంటే చూసాం ..అలానే అనిపిస్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ కూడా అదే జోష్లో ఫన్ తో నడిచి ఉంటే సినిమాకి కొంచమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేదని ..ఫస్ట్ అఫ్ ఫన్ రొమాంటిక్ సాగితే ..సెకండాఫ్ యాక్షన్ ధ్రిల్లర్గా సీరియస్ గా నడుస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు . అయితే పలువురు జనాలు రెచ్చిపోయి నాగశౌర్య సినిమాపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా తలనొప్పి వస్తుందని ..జండుబాం బ్యాగులో పెట్టుకొని వెళ్లడం మర్చిపోకండి “అంటూ ఫన్నీగా సెటైర్స్ వేస్తున్నారు . దీంతో రంగబలి సినిమా పూర్తి నెగటివ్ టాక్ తో అట్టర్ ఫ్లాప్ సినిమాగా రికార్డు నెలకొల్పింది.