టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ రీసెంట్ గానే తండ్రి అయ్యాడు . గత పదేళ్ళుగా అభిమానులు ఎంతో ఆశగా వెయిట్ చేసిన మూమెంట్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు రామ్ చరణ్ . రీసెంట్ గానే బారసాల ఫంక్షన్ చేసి పాపకు ఎంతో ట్రెడిషనల్ పేరుని పెట్టాడు. “క్లీంకార” అంటూ నామకరణం చేశారు . నిజానికి ఈ పేరుని ఉపాసన అమ్మ ఆమెకు పెట్టాలనుకున్నారట .
అయితే పరిస్థితులు కలిసి రాక.. ఆ పేరు ఇప్పుడు తన మనవరాలికి పెట్టేలా చేసుకున్నాడు. కాగా మెగా వారసురాలు పుట్టడంతో మెగా ఫ్యామిలీని మీట్ అవ్వడానికి బుల్లి లిటిల్ ప్రిన్సెస్ చూడడానికి చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట . అయితే మెగా ప్రిన్సెస్ ని చూడడానికి వచ్చేవాళ్ళు సెల్ ఫోన్స్ తీసుకో రాకూడదు అని .. పాపకు సంబంధించిన ఫొటోస్ తీయకూడదు అని ..పాపని కూడా టచ్ చేసే దానికి లేదు అని క్రేజీ కండీషన్స్ పెట్టారట మెగా ఫ్యామిలీ .
అంతేకాదు దగ్గర బంధువులైన సరే పాపను ఎవరికి చూపించట్లేదట. పాపకు దిష్టి తగులుతుందని .. మరోపక్క చిన్న పాప కావడంతో ఇన్ఫెక్షన్స్కు గురవుతుందని.. అందుకే క్లీంకార ను సెపరేట్గా ఒక రూమ్ లో పెట్టి కేర్ తీసుకుంటున్నారట . అంతేకాదు మెగా మనవరాళ్ళను సైతం ఎక్కువగా టచ్ చేయించకుండా దూరంగానే ఆడుకునేటట్లు చేస్తుందట ఉపాసన . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!