చిరంజీవి చేసిన చిన్న తప్పు.. 20 ఏళ్లు దూరం పెట్టిన స్టార్ హీరోయిన్..!!కొన్నిసార్లు కొన్ని చిన్ని మనస్పర్ధలు కారణంగా కొన్ని ఏళ్లు మాట్లాడుకోకుండా ఉండే జనాలు ఉన్నారు . అయితే కేవలం సామాన్య ప్రజలే కాదు స్టార్ సెలబ్రిటీస్ కూడా అలాంటి ఈగోస్ కారణంగా మనస్పర్ధలు కారణంగా మాట్లాడుకోకుండా ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే లిస్టులోకి వస్తారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి – హీరోయిన్ విజయశాంతి . వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీ షేక్ అయిపోవాల్సిందే అన్న ధీమా వ్యక్తం చేస్తారు అభిమానులు . అంతలా వీళ్ళిద్దరి కాంబో తెరపై సూపర్ సక్సెస్ అయింది .
వీళ్ళ కాంబోలో వచ్చిన మెకానిక్ అల్లుడు -ఛాలెంజ్ – కొండవీటి రాజా – పసివాడి ప్రాణం – స్వయంకృషి -యమునికి మొగుడు – అత్తకు యముడు అమ్మాయికి మొగుడు – గ్యాంగ్ లీడర్ – కొండవీటి దొంగ ఇలా ఎన్నెన్నో చిత్రాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇలాంటి క్రమంలోనే వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కూడా బాగా పెరిగింది . అయితే ఆ చనువుతోనే విజయశాంతి తెలంగాణ ఉద్యమం సమయంలో సినిమా ఇండస్ట్రీ నుండి విజయశాంతి పలువురు స్టార్స్ సపోర్ట్ కోరిందట .
కానీ ఎవరు అందుకు ముందుకు రాలేదు. అయితే చిరంజీవి కూడా ముందుకు రాకపోవడంతో విజయశాంతికి కోపం వచ్చిందట . అందుకే మాట్లాడటం మానేసిందట . ఇదే విషయాన్ని రీసెంట్ ఇంటర్వ్యూ కూడా చెప్పుకొచ్చింది . అయితే గ్యాంగ్ లీడర్ సినిమా టైంలో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని అప్పటినుంచి వీళ్ళు మాట్లాడుకోవడం మానేశారు అన్న కామెంట్స్ వినిపిస్తున్న క్రమంలో ఆమె ఇలా ఓపెన్ గా ఉన్న విషయాన్ని బయట పెట్టింది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!