Moviesస్టార్ హీరోయిన్ గా మారిన తరువాత రెండు తప్పులు చేసిన రష్మిక.....

స్టార్ హీరోయిన్ గా మారిన తరువాత రెండు తప్పులు చేసిన రష్మిక.. ఓపెన్ గానే చెప్పేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నాక కొన్ని కొన్ని సార్లు మనకు నచ్చిన ఆ సినిమాని వదులుకోవాల్సి వస్తుంది. దానికి కారణం కాల్ షీట్స్. అప్పటికే వేరే సినిమా కాల్ షీట్స్ లో బిజీగా ఉన్న కారణంగా మంచి సినిమాలు మన దగ్గరికి వచ్చిన మనం ఆ సినిమాకి సైన్ చేయలేం. అలా బోలెడు మంది హీరోయిన్స్ మంచి మంచి సినిమాలను మిస్ చేసుకుని ఉంటారు . తాజాగా అదే లిస్టు లోకి యాడ్ అయింది అందాల ముద్దుగుమ్మ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .

ఎస్ ఇదే విషయాన్ని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక మందన గతంలో ఇద్దరు సినిమాల్లో నటించడం మిస్ చేసుకున్నానని ఇప్పటికే ఆ విషయంలో గిల్టీగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఆ హీరోలు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి – కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి. మెగాస్టార్ కెరియర్ లోనే డిజాస్టర్ గా నడిచిన ఆచార్య సినిమాలో పూజా హెగ్డే పాత్ర కోసం రష్మిక మందన్నాను చూస్ చేసుకున్నారట కొరటాల శివ.

అయితే అమ్మడు ఈ పాత్రకు రిజెక్ట్ చేసింది . కాల్ షీట్స్ లేకపోవడంతో ఈ సినిమా కథ నచ్చిన వదులుకునిందట . అయితే విజయ్ దళపతి నటించిన మాస్టర్ సినిమాను సైతం రష్మిక కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకునిందట . నిజానికి నిజానికి విజయ్ దళపతి అంటే రష్మిక మందనకు చాలా చాలా ఇష్టం . ఆ తర్వాత వారసుడు సినిమాలో నటించింది కానీ అది డిజాస్టర్ గా మారింది ఈ రెండు సినిమాలు మిస్ చేసుకున్నందుకు రష్మిక బాగా బాధపడిందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news