ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . కాగా ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు పారితోషకం అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాజ్యమేలేస్తున్న అల్లు అర్జున్ ..తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు. కొన్ని ఫ్లాప్ కొన్ని హిట్లు అయ్యాయి. అయితే ఏ హీరో అయినా సరే కథను నమ్మి సినిమా చేసేటప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిస్తే ఎవరు చేయరు . కానీ మన బన్ని పెద్ద సాహసమే చేశాడు.
తాను హీరోగా నటించిన ఓ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసిన కూడా బన్నీ ఆ సినిమాని ఎంతో ఇష్టంగా చేశాడు . ఆ సినిమానే ” నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా”. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2018లో గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది . అయితే బన్నీ కెరీర్ లోనే పరమ చెత్త టాక్ ను నమోదు చేసుకుంది . అను ఇమ్మానుయేల్ – అర్జున్ సర్జ – శరత్ కుమార్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు .
అయితే ఈ సినిమా మొత్తం దేశ భక్తి లా ఉంటుందని తెలిసి.. బన్నీ ముందుగానే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని భావించారట . ఈ కాలంలో ఈ జనరేషన్ అంత రొమాంటిక్ – సస్పెన్స్ – హారర్ సినిమాలు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎవరు చూస్తారు అంటూ ముందుగానే గెస్ చేశారట. కానీ కెరియర్ లో ఒకటైన దేశ భక్తి ఫిల్మ్ చేశాను అన్న తృప్తి నాకు ఉండాలి అన్న కారణంతోనే ఈ సినిమాలో బన్నీ నటించాడట. ఫైనల్లీ బన్నీ అనుకున్నదే జరిగింది.. సినిమా అట్టర్ ప్లాప్ అయింది ..!!