సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా స్టేటస్ అందుకున్న తర్వాత కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి టైం రావడంతో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోయిన అందాలు ముద్దుగుమ్మలు బోలెడు మంది ఉన్నారు . సినిమా ఇండస్ట్రీలో ఇలా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయిన ముద్దుగుమ్మలు ఎంతమందో లెక్క చెప్పలేం . అయితే కొంతమంది మాత్రం పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ తమ ప్యాషన్ ని కంటిన్యూ చేస్తున్నారు. అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ .
అయితే కాజల్ అగర్వాల్ కెరియర్ స్టార్టింగ్ నుంచి పెళ్లి చేసుకునే వరకు ఎంత హిట్ ట్రాక్ నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పట్టిందల్లా బంగారమే అన్నట్టు అమ్మడు సైన్ చేసిన ప్రతి సినిమా హిట్ అయింది . అయితే కెరియర్ పిక్స్ లో ఉండగానే పెళ్లి టైం అయిపోతూ ఉండడంతో ఇంట్లో బలవంతం చేయడం కారణంగా తన చిన్ననాటి స్నేహితుడు గౌతం కిచ్చులుని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ .. పెళ్లయిన వెంటనే ప్రెగ్నెన్సీ ని ప్లాన్ చేసేసుకోనింది.
జనరల్ గా ఏ స్టార్ సెలబ్రిటీలు ఇలా పెళ్ళి వెంటనే పిల్లల్ని ప్లాన్ చేసుకోరు. రెండు – మూడేళ్లు ఇంకా కుదిరితే నాలుగు ఏళ్లు కూడా గ్యాప్ తీసుకుంటారు . అయితే కాజల్ ఇంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి కారణం తమ తల్లిదండ్రులు ..తమ అత్తమామలే అంటూ తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ ఎలా పెళ్లయిన తర్వాత విడాకులు తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే . అందుకే కాజల్ – గౌతమ్ జంట అలా అవ్వకుండా ఉండాలి అంటే.
పెళ్లి తర్వాత వాళ్ల ప్రేమ బంధం ఇంకా బలపడడానికి ఓ బిడ్డకు జన్మనిస్తే ఆ ప్రేమ అలాగే కంటిన్యూ అవుతుందని.. పెద్దల మాట విని కాజల్ – గౌతమ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట . ఏ మాటకు ఆ మాట వీళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే అందుకే ఈ జంట హ్యాపీగా బేబీతో ఎంజాయ్ చేస్తుంది.