Newsఈ ఒక్క వార్త చాలదా.. నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకొవడానికి.. మిగత...

ఈ ఒక్క వార్త చాలదా.. నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకొవడానికి.. మిగత హీరోల ఫ్యాన్స్ కి కుళ్ళుకుని చావడానికి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహంగా పేరు సంపాదించుకున్న బాలయ్య ప్రజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్ ని అందుకుని ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యంగ్ హీరోలకి ధీటుగా సినిమాలకు సైన్ చేస్తూ చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్స్ పట్టుకొని మరి దూసుకుపోతున్న బాలయ్య.. ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నెలకొంటుంది . దానికి కారణం ఇప్పటివరకు బాలయ్యని మనం చూసిన లుక్స్ వేరు ఈ సినిమాలో చూడబోతున్న లుక్స్ వేరు అంటూ తెలుస్తుంది .

కాగా రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ డేట్ మొ ఫిక్స్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే రెండు చేతుల్లో రెండు భారీ గన్నులు పట్టుకొని శత్రువులపై విరుచుకుపడే విధానం చాలా చాలా ఆసక్తికరంగా ఉంది అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఇప్పటివరకు మనం బాలయ్యను చూసింది తొడ కొట్టడాలు.. కత్తితో నరకడాలు.. ఇలా చేతిలో గన్ను పట్టుకొని ఫుల్ మాస్ మాసివ్ రోల్లో చూడడం ఇదే ఫస్ట్ టైం ..ఈ సన్నివేశాలు థియేటర్లో చూస్తే అభిమానులకు పూనకాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనం ఊహించుకోవచ్చు .

మామూలుగానే బాలయ్య అభిమానుల్ని పట్టడం కష్టం.. ఇక ఇలాంటి పవర్ ఫుల్ మ్యాసివ్ సీన్స్ ఉంటే బాలయ్య అభిమానుల్ని ఆపగలమా ..? తుపాకీ గుళ్ల వర్షం కురిపిస్తే ఆ థియేటర్ స్క్రీన్ దద్దరిల్లి పోవాల్సిందే అంటున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఈ పోస్టర్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు ఈ ఒక్క న్యూస్ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకోవడానికి .. మిగతా హీరో ఫ్యాన్స్ కుళ్ళుకొని చావడానికి అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో భగవంత్ కేసరి హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news