ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో తరుణ్ త్వరలోనే మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నారా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . దానికి కారణం ఇంత వయసు వచ్చినా ఆయన పెళ్లి చేసుకోకపోవటం . తరుణ్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు . అంతేకాదు పెళ్లి చేసుకోను అని ఎక్కడా చెప్పడం లేదు . రీసెంట్ ఇంటర్వ్యూలో వాళ్ళ అమ్మగారు రోజా రమణి కూడా తరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ క్లారిటీ ఇచ్చింది .
అయితే యాంకర్ ఎవరు ఆ అమ్మాయి అని అడగడంతో ఇండస్ట్రీలో ఉండే ఓ బడా ఫ్యామిలీ లోని అమ్మాయి అంటూ పేరు రివిల్ చేయకుండానే అమ్మాయి ఎవరు అనేది పరోక్షకంగా హింట్ ఇచ్చేసింది. ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ అంటే కచ్చితంగా మెగా ఫ్యామిలీ – నందమూరి ఫ్యామిలీ – దగ్గుబాటి ఫ్యామిలీ -అక్కినేని ఫ్యామిలీ. నందమూరి ఫ్యామిలీ లో అమ్మాయిలు లేరు .. ఉన్న ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి అయిపోయింది . అక్కినేని ఫ్యామిలీలో అమ్మాయిలు లేరు.. ఉన్నదల్లా మెగా ఫ్యామిలీ – దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ కూతురు ఒక్కటే ఉంది . వెంకటేష్ కూతురికి తరుణ్ కి చాలా ఏజ్ గ్యాప్ ఉంది అయితే కచ్చితంగా ఈ సంబంధం అయితే కాదు.
ఇక మిగిలింది మెగా ఫ్యామిలీ . మెగా ఫ్యామిలీ లో ఆల్రెడీ అమ్మాయిలు అందరికి పెళ్లి అయిపోయాయి. కానీ డివర్స్ కూడా ఇచ్చేశారు. ఈ క్రమంలోనే తరుణ్ పెళ్లి నిహారికతో కానీ లేకపోతే శ్రీజతో కాని జరగబోతుంది అంటూకొందరు ఆకతాయిలు కావాలనే ప్రచారం చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నాడు తరుణ్ అనే వార్త జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయిపోతుంది . అయితే ఇది నిజమా..? లేక అబద్ధమా..? అనేది వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా క్లారిటీ ఇస్తేనే బాగుంటుంది అంటున్నారు అభిమానులు . ఒకవేళ నిజంగా ఇది జరిగితే ఆయన జీవితం నాశనం అయిపోవడమే అంటున్నారు ఆయన ఫ్యాన్స్ . చూడాలి మరి దీనిపై తరుణ్ ఏ విధంగా స్పందిస్తాడో..?