ఎస్ ఇప్పుడు ఇదే మాట తెలుగు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ – సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్రో సినిమా మూవీ ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. కోలీవుడ్‌లో హిట్ అయిన వినోదయ సితం సినిమాకు రీమేక్‌గా ఈ బ్రో మూవీ తెరకెక్కింది. కోలీవుడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమా టీజర్‌తో పాటు ఫస్ట్ సింగిల్స్ అంటూ బయటకు వచ్చాయి. సినిమాపై అనుకున్నంత బజ్ అయితే కనపడడం లేదు. సంగీత దర్శకుడు థమన్ మీద సోషల్ మీడియాలో సినిమా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొందరు పవన్ ఫ్యాన్స్ అయితే తిట్లు, మరి కొంత మంది సెటైర్లు, ఇంకొంత మంది డిమాండ్లు.. ఓవరాల్‌గా థమన్ బాగా టార్గెట్ అయ్యాడు.
తాజాగా బ్రో నుంచి వచ్చిన పాట చూశాక పవన్ ఫ్యాన్స్ అయితే నీరసం అయిపోయారు. బ్రో నుంచి వచ్చే పాట మీద పవన్ ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవు. పైగా బన్నీతో చేసిన అలవైకుంఠపురములో తరువాత థమన్-త్రివిక్రమ్ కాంబినేషన్ పాట ఇది. ఈ సినిమాకు పేరుకు మాత్రమే దర్శకుడు సముద్రఖని. తెరవెనక నడిపించింది అంతా త్రివిక్రముడే.
బ్రో సినిమాను ఇప్పటికే ఆంధ్ర 40 కోట్లకు, నైజాంలో రు. 35 కోట్లకు అమ్మాలని చూస్తున్నారు. ఈ టైంలో వచ్చిన ఈ పాట బాగా డిజప్పాయింట్ చేసింది. అసలు థమన్ ఇచ్చిన ట్యూన్ ఏమాత్రం క్యాచీగా లేదని… విజువల్స్ కూడా గొప్పగా లేవని… సాయి ధరమ్ తేజ్ మూవ్ మెంట్స్ కూడా బాలేదంటున్నారు. మొత్తానికి బ్రో ఏ మాత్రం తేడాకొట్టినా అజ్ఞాతవాసి 2 అవుతుందని.. త్రివిక్రమ్ రెండు పడవల మీద కాళ్ల సిద్ధాంతానికి పవన్ బలైపోతున్నాడని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.