జూనియర్ ఎన్టిఆర్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. డైలాగ్ లు చెప్పాలన్న, డాన్స్ వేయాలన్న, స్పీచ్ లు ఇవ్వాలన్న ఎన్టిఆర్ తరువాతే. కళ్ళతోనే నటించడం ఎన్టిఆర్ కు మాత్రమే సాధ్యం. తాజగా RRR సినిమాతో గ్లోబల్ రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డులని సృష్టించింది. ఈ సినిమా తరువాత మరో ఎన్టిఆర్ మరో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. అదే కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర సినిమా. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఆ తరువాత ఎన్టిఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నాడు. వరుసగా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తూ ఎన్టిఆర్ బిజీబిజీగా ఉన్నారు. అయితే గతంలో ఎన్టిఆర్ 12 పెద్ద సినిమాలను రిజెక్ట్ చేసారంట. అయితే ఆ 12 సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ లు కొట్టాయి. ఆ 12 సినిమాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం.
- కిక్ – కిక్ సినిమా రవితేజ కెరీర్ లో ఎంత పెద్ద హిట్ సినిమానో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఇప్పటికి టీవీలో వస్తే కదలకుండా చూస్తున్నారు. ఈ సినిమాకి సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ముందు ఎన్టిఆర్ కి అనుకున్నారు కానీ చివరికి రవితేజ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు.
- దిల్ – ఈ సినిమా నితిన్ కెరీర్ లో ఒక మరిచిపోలేని సినిమా అనే చెప్పాలి. కాలేజీ స్టూడెంట్ గా నితిన్ ఈ సినిమాలో అదరగొట్టారు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని ఎన్టిఆర్ రిజెక్ట్ చేసారంట.
- శ్రీమంతుడు – కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఒక క్లాసిక్. మహేష్ బాబు నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. కొరటాల శివతో ఎన్టిఆర్ జనతా గ్యారేజ్ సినిమా చేసారు. ఇప్పుడు దేవర సినిమా చేస్తున్నారు. శ్రీమంతుడు కూడా చేసి ఉంటె హ్యాట్రిక్ కొట్టేవారని అభిమానులు అంటున్నారు.
- ఆర్య – అల్లుఅర్జున్ కెరీర్ లో ఆర్య సినిమా ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వంలో వహించారు. ఈ సినిమా తరువాత అల్లుఅర్జున్, సుకుమార్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పుష్ప 2 చేస్తున్నారు. అయితే ఆర్య సినిమాని కూడా ఎన్టిఆర్ రిజెక్ట్ చేసారు.
- అతనొక్కడే – సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఎన్టిఆర్ మరో సినిమా మిస్ అయ్యారు. ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
- భద్ర – బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ సినిమా భద్ర. ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికి చాలా మందికి ఫేవరెట్.
- కృష్ణ – వివి వినాయక్ దర్శకత్వంలో ఎన్టిఆర్ మరో సినిమా మిస్ చేసుకున్నాడు. కృష్ణలో రవితేజ, బ్రహ్మానందం టైమింగ్ ఎప్పటికి గుర్తుండిపోతుంది.
- ఎవడు- రాంచరణ్ కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ ఎవడు. అయితే ఈ సినిమా ముందు ఎన్టిఆర్, కళ్యాణ్ రామ్ చేయాలని వంశీ పైడిపల్లి ప్లాన్ చేసారు. అయితే డేట్స్ సెట్ కాకపోవడంతో రాంచరణ్, అల్లుఅర్జున్ కి చెప్పారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
- ఊపిరి- నాగార్జున కెరీర్ లో ఊపిరి సినిమా ఎప్పటికి గుర్తుండిపోతుంది. కార్తీ క్యారెక్టర్ ముందు ఎన్టిఆర్ అనుకున్నారు డైరెక్టర్ వంశీ. కానీ కథలో కొన్ని మార్పులు చేయాలని ఎన్టిఆర్ చేయడంతో వంశీకి నచ్చక కార్తీని తీసుకున్నాడు.
- బ్రహ్మోత్సవం – ఈ సినిమా ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే మహేష్ బాబు వద్దకు వెళ్ళింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టింది.
- నా పేరు సూర్య – అల్లుఅర్జున్ చేసిన ఈ సినిమా ఎన్టిఆర్ చేయాల్సింది. అయితే ఈ కథని ఎన్టిఆర్ రిజెక్ట్ చేసారు.
- శ్రీనివాస కళ్యాణం – ఈ సినిమా మొదట డైరెక్టర్ ఎన్టీఆర్ కు చెప్పారంట. అయితే సున్నితంగా వద్దని ఈ సినిమాని ఎన్టిఆర్ రిజెక్ట్ చేసారంట. దీంతో ఈ సినిమా నితిన్ వద్దకు వెళ్ళింది.