Moviesతండ్రి కాబోతున్న ముక్కు అవినాష్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..ఏమైందంటే..?

తండ్రి కాబోతున్న ముక్కు అవినాష్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..ఏమైందంటే..?

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతటి పాపులారిటీ దక్కించుకుందో.. ఆ షోలో కామెడీని పండించిన జనాలు సైతం అంతే పాపులారిటీ దక్కించుకున్నారు. మరీ ముఖ్యంగా హైపర్ ఆది – సుడిగాలి సుదీర్- గెటప్ శ్రీను – ఆటో రాంప్రసాద్ లాంటి వాళ్ళు ఎంత పాపులారిటీ దక్కించుకున్నారో..అదే రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు ముక్కు అవినాష్ . తనదైన స్టైల్ లో స్కిట్స్ వేసి అందరినీ అలరించిన ఈ ముక్కు అవినాష్ ..బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫేట్ మారిపోయింది .

అంతేకాదు ముక్కు అవినాష్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సొంతంగా ఇల్లు కొనుక్కొని ఫ్యామిలీని ఏర్పాటు చేసుకున్నారు. అంతే కాదు ముక్కు అవినాష్ తన స్నేహితురాలైన అనుజను పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే . యూట్యూబ్లో పలు రియాల్టీ షోలో పాల్గొంటున్న ఈ జంట ..తాజాగా ఓ శుభవార్త చెప్పింది . త్వరలోనే తాము ముగ్గురం కాబోతున్నాము అంటూ తీపి న్యూస్ ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు ముక్కు అవినాష్. ఈ విషయాన్ని ఇతను యూట్యూబ్ ఛానల్ వేదిక ద్వారా బయట పెట్టాడు . తన భార్య అనుజ ప్రేగ్నెంట్ అని ఇంట్లోకి త్వరలోనే ఓ బేబీ రాబోతుందని చెప్పుకొచ్చాడు.

” అక్టోబర్లో మా పెళ్లి రోజు ఉంది ..ఇంకా పిల్లలను ఎప్పుడు కంటారు అంటూ మమ్మల్ని చాలామంది అడుగుతూ వచ్చారు. ఇదే వాళ్ళందరికీ సమాధానం ..నా భార్య తల్లి కాబోతుంది నేను తండ్రిని కాబోతున్నాను “అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సోషల్ మీడియాలో ముక్కు అవినాష్ ని ట్రోల్ చేస్తున్నారు జనాలు. ప్రెగ్నెన్సీ న్యూస్ పబ్లిక్ గా చెప్పుకోవాలా ..భార్యని కేర్ ఫుల్ గా చూసుకుంటే సరిపోతుంది. ఇలాంటివన్నీ మీడియాలో పెట్టి మీ పర్సనల్ లైఫ్ని పబ్లిక్ ఎందుకు చేస్తున్నారు..? మళ్ళీ ఏదైనా కామెంట్ చేస్తే మీరే రివర్స్ గా బాధపడినట్లు మళ్లీ వీడియో చేస్తారు అంటూ ట్రోల్ చేస్తున్నారు . దీంతో ముక్కు అవినాష్ పేరు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news