Moviesరామ్ చరణ్-ఉపాసన కి పాప పుట్టడం..ఆ మెగా మెంబర్ కి ఇష్టం...

రామ్ చరణ్-ఉపాసన కి పాప పుట్టడం..ఆ మెగా మెంబర్ కి ఇష్టం లేదా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మెగా ప్రిన్సెస్ “క్లీం కార” పేరే మారు మ్రోగిపోటుంది. చాలా పద్ధతిగా ..ట్రెడిషనల్ గా ..శక్తి స్వరూపమైన పేరును పెట్టుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలికి. రీసెంట్ గానే ఉపాసన మెగా వారసురాలికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జూన్ 20వ తేదీ ఒంటిగంట 49 నిమిషాలకు అపోలో హాస్పిటల్స్ లో ఉపాసన పండు లాంటి పాపకు జన్మనిచ్చింది.

ఆ క్షణం మొదలు ఇప్పటివరకు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది హాష్ ట్యాగ్ మెగా లిటిల్ ప్రిన్సెస్ . ఇప్పటికీ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో నే ట్రెండ్ అవుతున్న ఈ మెగాలిటిల్ ప్రిన్సెస్ కి క్లీం కార అంటూ పేరు పెట్టుకోవచ్చారు మెగా కుటుంబ సభ్యులు. అయితే సోషల్ మీడియాలో ఈ పేరుని పలు రకాలుగా ట్రోల్ చేస్తున్నారు . ఇంకేం పేర్లు దొరకలేదా ..?అంటూ నానా విధాలుగా మాట్లాడుతున్నారు.

కాగా రీసెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూతురు పుట్టడం తన ఇంట్లోని ఓ వ్యక్తికి ఇష్టం లేదు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . గతంలో ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి కూతురు సుస్మిత మాట్లాడుతూ..” మా ఇంట్లో ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. చరణ్ కి కొడుకు పుడితే బాగుంటుంది “అని చెప్పకు వచ్చింది . ఇదే మాటలను ట్రోల్ చేస్తూ మెగా డాటర్ కి మెగా గ్రాండ్ డాటర్ అంటే ఇష్టం లేదని ..చెప్పుకొస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మరోసారి మెగా డాటర్ సుస్మిత పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news