Newsఓ పక్క విడాకులు.. మరోపక్క బుర్ఖా వేసుకుని కలర్స్ స్వాతి ఏం...

ఓ పక్క విడాకులు.. మరోపక్క బుర్ఖా వేసుకుని కలర్స్ స్వాతి ఏం చేసిందో చూడండి(వీడియో)..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో హీరోయిన్ కలర్స్ స్వాతి విడాకుల మేటర్ ఏ రేంజ్ లో హీట్ పెంచేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిన్న మొన్నటి వరకు అసలు అడ్రస్ లేకుండా పోయిన కలర్స్ స్వాతి ..మీడియాలో విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం చేయడంతో ఓవర్ నైట్ లో ఆమె పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే ఈ వార్తలపై కలర్స్ స్వాతి ఏ విధంగా స్పందించకపోవడంతో నిజంగానే కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా హీరోయిన్ కలర్స్ స్వాతి తన సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోలు షేర్ చేసింది . ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలో కలర్స్ స్వాతి ఎక్కడికో ప్రయాణం అవుతున్నట్లు మనకు కనిపిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బుర్ఖా ధరించి అటు ఇటు తిరుగుతూ ఫన్నీ ఫన్నీగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది . అక్కడున్న వారు ఎవరు ఆమె కలర్స్ స్వాతి అని గుర్తుపట్టలేక పోతారు .

ఈ క్రమంలోని సరదాగా రోడ్లపై కాసేపు చక్కర్లు కొట్టిన కలర్స్ స్వాతి ఆ తర్వాత ఓ బుక్ స్టాల్ లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసింది. ఆ తర్వాత మంచి ఫిల్టర్ లాంటి కాఫీ తాగి మళ్ళీ ట్రైన్ ఎక్కేసి బుర్ఖా తీసేసి దర్శనమిచ్చింది. దీంతో అసలు కలర్స్స్వాతి ఎందుకు ఈ వీడియోని పోస్ట్ చేసింది ..అనేది తెలియడం లేదు. అయితే కలర్స్ స్వాతి పోస్ట్ చేసిన వీడియోలో ఎక్కడ తాళి ధరించలేదు.. అంతేకాదు నుదిట బొట్టు కూడా పెట్టుకోలేదు . కాళ్ళకి మెట్టెలు కూడా లేవు. ఈ క్రమంలోనే ఆమె విడాకులు తీసుకోబోతుంది అంటూ మరింతగా నమ్మేస్తున్నారు అభిమానులు. కలర్స్ స్వాతి బుర్ఖా వేసుకొని హైదరాబాదులో హల్చల్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news